AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: శృంగారం చేసే సమయంలో సీక్రెట్‌గా కండోమ్‌ తీసేశాడు.. కట్ చేస్తే.. యువతి మాస్టర్ స్కెచ్.. చివరికి!

మకు నచ్చిన వ్యక్తులతో డేటింగ్‌కి వెళ్లడం.. పెళ్లి కాకుండానే వారితో కలిసి జీవించడం వంటివి చేస్తుంటారు. ఇక ఇలా ఉండటం అక్కడ నేరమేమి కాదు.

Viral: శృంగారం చేసే సమయంలో సీక్రెట్‌గా కండోమ్‌ తీసేశాడు.. కట్ చేస్తే.. యువతి మాస్టర్ స్కెచ్.. చివరికి!
Condoms
Ravi Kiran
|

Updated on: Apr 24, 2023 | 1:09 PM

Share

మన దేశంలో తక్కువే గానీ.. పాశ్చాత్య దేశాల్లో మాత్రం డేటింగ్ అనేది సర్వసాధారణం. తమకు నచ్చిన వ్యక్తులతో డేటింగ్‌కి వెళ్లడం.. పెళ్లి కాకుండానే వారితో కలిసి జీవించడం వంటివి చేస్తుంటారు. ఇక ఇలా ఉండటం అక్కడ నేరమేమి కాదు. కానీ ఇక్కడ ఒక ఆసక్తికర విషయమేంటంటే.. డేటింగ్ చేస్తున్న వ్యక్తి.. తన భాగస్వామిని ఏ విధంగా చీట్ చేసినా.. అది అక్కడ పెద్ద నేరం. సరిగ్గా ఇలాంటి కోవకు చెందిన ఓ ఘటన నెదర్లాండ్స్‌లో జరిగింది. శృంగారం చేసే సమయంలో ప్రియురాలికి తెలియకుండా కండోమ్‌ను సీక్రెట్‌గా తొలగించాడు.. కట్ చేస్తే.. ఇప్పుడు ఊసలు లెక్కపెడుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. 28 ఏళ్ల ఖల్‌దౌన్ అనే వ్యక్తికి ఓ యువతితో ఈ ఏడాది మొదట్లో ఆన్‌లైన్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. ఒకట్రెండు సార్లు శారీరికంగా కూడా కలుసుకున్నారు. కానీ ఆ యువతి శారీరికంగా కలవడానికి ముందు ఓ షరతు పెట్టింది. కచ్చితంగా కండోమ్ ఉండాలని కోరింది. తనకు సెక్యువల్ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్‌లు, ప్రెగ్నన్సీ లాంటివి రాకుండా ఉండేందుకు ఖల్‌దౌన్‌ను కండోమ్ వాడాలని సూచించింది సదరు యువతి. అయితే ఖల్‌దౌన్‌ శృంగారం చేసే సమయంలో ఆమె తెలియకుండా సీక్రెట్‌గా కండోమ్‌ను తొలగించాడు. అనంతరం ఈ విషయం కాస్తా ఆ యువతికి తెలియడంతో.. అతడిపై రేప్ కేసు నమోదు చేసి.. స్థానిక రోటర్‌డామ్ కోర్టుకెక్కింది.

ఇవి కూడా చదవండి

వారిద్దరి వాదోపవాదనలు విన్న న్యాయస్థానం.. చివరికి ఖల్‌దౌన్‌‌ను నేరస్థుడిగా పరిగణించింది. బాధితురాలికి, ముద్దాయికి మధ్య పర్సనల్ మెసేజ్‌లు బట్టి.. వారిరువురూ పరిస్పర అంగీకారంతోనే శారీరికంగా కలిశారని.. అతడిపై రేప్ ఆరోపణలు నిరాధారమైనవి అని తేల్చింది. సదరు యువతి కండోమ్ ఉపయోగించాలని ముందుగా సూచించినా.. ఖల్‌దౌన్‌ ఆమెను లైంగికంగా సంక్రమించే వ్యాధులు, అవాంఛిత గర్భధారణకు గురిచేశాడని కోర్టు పేర్కొంది. అతడు ‘స్టాల్థింగ్’ నేరానికి పాల్పడ్డాడని.. కావున, ఖల్‌దౌన్‌‌కు మూడు నెలల జైలు శిక్ష, వెయ్యి యూరోల జరిమానా విధిస్తున్నట్లు కోర్టు తీర్పును ప్రకటించింది.(Source)