అమ్మబాబోయ్! కుప్పలు తెప్పలుగా కింగ్ కోబ్రాలు.. చటుక్కున పట్టేసిన అక్కాచెల్లెళ్లు.. చూస్తే గుండె గుభేలే!
కింగ్ కోబ్రా.. అత్యంత ప్రమాదకరమైన విషసర్పాల్లో ఒకటి. కాటేసిందంటే.. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. సాధారణంగా పాములు దూరం నుంచి చూస్తేనే చాలామంది భయపడతారు.
కింగ్ కోబ్రా.. అత్యంత ప్రమాదకరమైన విషసర్పాల్లో ఒకటి. కాటేసిందంటే.. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. సాధారణంగా పాములు దూరం నుంచి చూస్తేనే చాలామంది భయపడతారు. అలాంటిది కింగ్ కోబ్రా లేదా త్రాచు పాము లాంటివి అయితే.. ఇంకేమైనా ఉందా గుండె ఆగినంత పనవుతుంది. స్నేక్ క్యాచర్లు సైతం ఈ కింగ్ కోబ్రాను పట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ ఇక్కడొక వీడియోలో.. ఇద్దరు అక్కాచెల్లెళ్లు బొరియాలో దాక్కున్న ఐదు కింగ్ కోబ్రాలను ఒంటి చేతులతో ఇట్టే పట్టేశారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.
వైరల్ వీడియో ప్రకారం.. ఓ ఇద్దరు అక్కాచెల్లెళ్లు మరో వ్యక్తితో కలిసి పనికి వెళ్లేటప్పుడు.. కింగ్ కోబ్రాలు రోడ్డు మార్గం గుండా పక్కనే ఉన్న ప్రాంతంలోని ఓ బొరియాలో దాక్కున్నట్లు గుర్తించారు. వెంటనే వారు తమ దగ్గర ఉన్న పనిముట్లతో ఆ ప్రాంతానికి వెళ్తారు. అక్కడ బొరియాలో నుంచి ఆ పాములను బయటికి తీయడం సాధ్యం కాకపోవడంతో.. గడ్డపారతో చుట్టూ తవ్వుతారు. అంతేకాకుండా బొరియాలో ఉన్న పాములు బుస కొడుతూ బయటకు తలలు పెట్టడం గమనిస్తారు. దీనితో వెంటనే ఆ కాటు నుంచి తప్పించుకునేందుకు ఈ అక్కాచెల్లెళ్లు పక్కకు తప్పుకుంటారు.
తన దగ్గర ఉన్న ఓ కర్ర సాయంతో ఇద్దరమ్మాయిలలో ఒకరు బొరియాలో దాక్కున్న ఐదు పాముల తోకలను పట్టుకుని ఒక్కసారిగా బయటికి లాగుతుంది. ఏ మాత్రం భయపడకుండా ఒక్కో పామును కంట్రోల్ చేస్తూ ఓ సంచిలో బంధిస్తుంది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది పాత వీడియో అయినప్పటికీ.. మరోసారి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.