Tollywood: ‘చెప్పవే చిరుగాలి’ హీరోయిన్ గుర్తుందా.? ఆ మధ్య సినిమాలకు దూరమై.. ఇప్పుడేం చేస్తోందో తెలుసా!

'చెప్పవే చిరుగాలి' సినిమాలో హీరోయిన్‌గా నటించిన అభిరామి గుర్తిందా.? హీరో వేణు సరసన.. ఆ సినిమాలో నటించి.. తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

Tollywood: 'చెప్పవే చిరుగాలి' హీరోయిన్ గుర్తుందా.? ఆ మధ్య సినిమాలకు దూరమై.. ఇప్పుడేం చేస్తోందో తెలుసా!
Tollywood
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 24, 2023 | 11:15 AM

‘చెప్పవే చిరుగాలి’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అభిరామి గుర్తిందా.? హీరో వేణు సరసన.. ఆ సినిమాలో నటించి.. తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. బుల్లితెర నుంచి తన కెరీర్‌ను ప్రారంభించిన అభిరామి.. టెలివిజన్ వ్యాఖ్యాతగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో ఎక్కువ సినిమాలు చేసిన అభిరామి.. తెలుగులో మాత్రం చాలా తక్కువ చిత్రాల్లోనే నటించింది. చెప్పవే చిరుగాలి తర్వాత ఆమె తెలుగు తెరపై మళ్లీ కనిపించలేదు. 2004లో సినిమాలకు పూర్తిగా దూరమైన అభిరామి.. తిరిగి మళ్లీ 10 ఏళ్లకు ఓ మలయాళ చిత్రంలో ఇండస్ట్రీకి రీ-ఎంట్రీ ఇచ్చింది.

‘కథాపురుషన్’ అనే మలయాళ సినిమాతో బాలనటిగా వెండితెరకు పరిచయమైంది అభిరామి. ఆ తరువాత, పత్రం, న్జంగల్ సంతుస్తరను , మెర్కారా, శ్రద్ధ, మిలీనియం స్టార్స్ , మెలెవర్యతే మలఖక్కుట్టికల్ , మేఘసందేశం వంటి మలయాళ సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తర్వాత కన్నడంలో రక్తకన్నీరు, లాలి హాడు వంటి చిత్రాలు.. తమిళంలో మిడిల్ క్లాస్ మాధవన్ , చార్లీ చాప్లిన్, దోస్త్, కర్మేఘమం లాంటి సినిమాల్లో నటించింది.

ఇవి కూడా చదవండి

తెలుగులో మాత్రం ఆమె చేసింది తక్కువ చిత్రాలే. చెప్పవే చిరుగాలి సినిమా అభిరామికి మంచి పేరు తెచ్చిపెట్టగా.. దాని కంటే ముందు ‘థాంక్యూ సుబ్బారావు’, ‘చార్మినార్’ చిత్రాలు చేసింది. ఇక మళ్లీ 2018లో టాలీవుడ్‌కు రీ-ఎంట్రీ ఇచ్చి రవితేజ “అమర్ అక్బర్ ఆంటోని” సినిమాలో క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది. కాగా, నటిగా మాత్రమే కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా అభిరామికి మంచి పేరు ఉంది. ‘విశ్వరూపం’, ‘విశ్వరూపం 2’ సినిమాలలో హీరోయిన్ పూజ కుమార్‌కు తమిళంలో డబ్బింగ్ చెప్పింది అభిరామి. తాజాగా ఆమె ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by Abhirami (@abhiramiact)

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!