Tollywood: ‘బన్నీ’ మూవీ హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడెలా ఉంది.. ఏం చేస్తుందో తెలుసా!
సినీ ఇండస్ట్రీలో కొనసాగాలంటే.. అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. టాలీవుడ్‌లో ఇలా వచ్చి..

సినీ ఇండస్ట్రీలో కొనసాగాలంటే.. అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. టాలీవుడ్‌లో ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయిన హీరోయిన్లు ఎందరో ఉన్నారు. ఇక అప్పట్లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లు గురించి కొందరు నెటిజన్లు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వెతుకుతున్నారు. ఆ కోవలోనే తాజాగా ‘బన్నీ’ హీరోయిన్ గౌరీ ముంజల్ ఇప్పుడెలా ఉంది.? ఏం చేస్తుందో అని సెర్చ్ చేస్తున్నారు.
‘బన్నీ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన గౌరీ ముంజల్. మొదటి మూవీతో ఓవర్‌నైట్ స్టార్‌డమ్, బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ దక్కించుకుంది. ఆ తర్వాత ఆమె మరిన్ని సినిమాల్లో హీరోయిన్‌గా చేసినా.. ఆమెకు ‘బన్నీ’ తీసుకొచ్చినంత గుర్తింపు మాత్రం రాలేదు. ఇక ఢిల్లీలో పుట్టిన పెరిగిన ఈ భామ.. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి సుమారు 16 సినిమాల్లో నటించింది.




అయితే వాటిల్లో చాలా చిత్రాలు ఫ్లాప్‌లు కావడంతో అవకాశాలు రావడం తగ్గిపోయాయి. దీంతో 2011లో ఢిల్లీకి తిరిగి వెళ్లిపోయింది. అక్కడే బిజినెస్ చేస్తూ సెటిల్ అయిపోయింది. కాగా, 40వ వడికి చేరుతున్నా.. ఇంకా సింగిల్‌గానే ఉండిపోయింది ఈ బ్యూటీ. తాజాగా ఈ భామకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. లేట్ ఎందుకు మీరూ చూసేయండి.