Janhvi Kapoor: తెలుగులో జాన్వీ మరో సినిమా.. ఏకంగా ఆ స్టార్ హీరోతో జతకట్టే ఛాన్స్.
అలనాటి అందాల తారా, దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఎట్టకేలకు కాన్ఫామ్ అయిన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటిస్తోందీ బ్యూటీ. ఈ సినిమా కోసం..
అలనాటి అందాల తారా, దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఎట్టకేలకు కాన్ఫామ్ అయిన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటిస్తోందీ బ్యూటీ. ఈ సినిమా కోసం జాన్వీ భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. తొలి చిత్రంలోనే స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ.. తాజాగా మరో భారీ ఆఫర్‌ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. కొరటాల సినిమా షూటింగ్ మొదలైన కొన్ని రోజులకే జాన్వీ తెలుగులో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
తొలి సినిమాలో నందమూరి హీరోతో ఆడిపాడనున్న ఈ బ్యూటీ.. రెండో చిత్రంతో మెగా హీరోతో జతకట్టనుంది. అవును జాన్వీ కపూర్ రెండో చిత్రంతో రామ్‌చరణ్ సరసన నటించే అవకాశం కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీని తీసుకుంటున్నారని సమాచారం. ఇప్పటికే ఈ విషయమై జాన్వీని అడగ్గా దానికి జాన్వీ ఓకే చెప్పారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా కాబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇందులో చెర్రీ డ్యూయల్ రోల్ నటించనున్నాడని సమాచారం. ఇక ఇద్దరు హీరోయిన్లు నటించనున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా జాన్వీ, మరో హీరోయిన్‌గా మృణాల్ నటించనుందని సమాచారం. వీటిపై క్లారిటీ రావాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించే వరకు వేచి చూడాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..