Tollywood: ఈ ఫోటోలో హీరోని గుర్తుపట్టారా.? నటనకు బ్రాండ్ అంబాసిడర్.. క్రేజీ సూపర్ స్టార్..
తమ ఫేంకు తగ్గట్టుగా సినిమాలు చేసే స్టార్ హీరోలు.. ఎక్స్‌పెరిమెంట్స్ చేయడానికి ఒకట్రెండు సార్లు ఆలోచిస్తుంటారు. ఫ్లాప్‌లు వస్తే..
తమ ఫేంకు తగ్గట్టుగా సినిమాలు చేసే స్టార్ హీరోలు.. ఎక్స్‌పెరిమెంట్స్ చేయడానికి ఒకట్రెండు సార్లు ఆలోచిస్తుంటారు. ఫ్లాప్‌లు వస్తే ఎక్కడ కెరీర్ డౌన్‌ఫాల్ అవుతుందేమోనని భయపడుతుంటారు. సినిమాల కంటెంట్ విషయంలో అస్సలు రిస్క్ తీసుకోరు. అయితే కొందరు హీరోలు మాత్రం.. సినిమా ఫలితంపై ఆధారపడకుండా.. ప్రతీ మూవీకి వైవిధ్యతను చూపిస్తూ.. ప్రాణం పెట్టి నటిస్తారు. ఇలాంటి హీరోలు తెలుగులో ఒకరిద్దరు ఉన్నా.. మిగతా భాషల్లో మాత్రం చాలామందే ఉన్నారు.
పైన పేర్కొన్న ఫోటోలోని వ్యక్తి కూడా ఓ స్టార్ హీరోనే. ప్రతీ మూవీకి తన లుక్ మార్చుకుంటూ.. వైవిధ్యతను చూపిస్తుంటాడు. తాజాగా ఓ కొత్త చిత్రానికి ఆ హీరో మార్చిన లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎవరో గుర్తుపట్టారా.? ఆ హీరో.. మరెవరో కాదు తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్. ‘ఐ’ చిత్రం కోసం గూని వ్యక్తిలా కనిపించిన విక్రమ్.. ఇప్పుడు మరోసారి డీ-గ్లామరైజ్డ్ రోల్‌లో కనిపిస్తున్నాడు. ‘తంగలాన్’ మూవీ కోసం ఈవిధంగా మారిపోయాడు.
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. దీనికి పా. రంజిత్ దర్శకుడు. పాన్ ఇండియా వైడ్‌గా రీలీజ్ కాబోతున్న ఈ మూవీలో మరోసారి విక్రమ్ నటవిశ్వరూపం చూపించనున్నాడు. ఇందులో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే విక్రమ్ పుట్టినరోజు కానుక విడుదల చేసిన మేకింగ్ వీడియో కూడా ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
Thank you for all the love pouring in. Am moved beyond words. ?உங்களுக்காக என்னோட சிறிய பிறந்தநாள் பரிசு. (Ur a rockstar Ranjith. நன்றிகள் பல.) #Thangalaan @beemji @StudioGreen2 https://t.co/Vm6R9EJJRD pic.twitter.com/6jD666KlwE
— Vikram (@chiyaan) April 17, 2023