Tollywood: ఒక్క సినిమాతో ఓవర్‌నైట్ క్రేజ్.. వరుసగా మెగా హీరోలతో ఛాన్స్.. ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా?
పైన ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఈ అమ్మడు ఇప్పటిదాకా తెలుగులో చేసింది మూడు సినిమాలే. కానీ స్టార్ హీరోయిన్..
పైన ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఈ అమ్మడు ఇప్పటిదాకా తెలుగులో చేసింది మూడు సినిమాలే. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్‌లో ఫాలోయింగ్ సంపాదించింది. వరుసగా మెగా హీరోల సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంది. త్వరలోనే రెండు పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకులను పలకరించనుంది. ఎవరో గుర్తుపట్టారా.? సరే! మీకో క్లూ.. ఆమెను వర్ణిస్తూ.. ‘ఎంత పెద్ద కళ్లు ఉంటే.. అంత ఎక్కువ ప్రేమ ఉన్నట్లు’.. ఇది హీరో చెప్పే డైలాగ్. ఇప్పుడు ఇదే ఫేమస్. గుర్తొచ్చిందా ఆ హీరోయిన్ ఎవరో..?
అవునండీ! ఆమె మరెవరో కాదు.. సంయుక్త మీనన్. పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమాతో ఈ మలయాళీ ముద్దుగుమ్మ తెలుగులోకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ‘బింబిసార’, ‘సార్’ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్స్ అందుకుంది. ఇక ఇప్పుడు ఆమె నటించిన ‘విరూపాక్ష’ చిత్రం విడుదలకు సిద్దం అవుతుండగా.. ‘డెవిల్’ చిత్రీకరణ దశలో ఉంది.
కాగా, తెలుగుతో పాటు మలయాళం, తమిళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది సంయుక్త. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది.
View this post on Instagram