AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: పవన్‌తో అల్లరి చేసిన ఈ తుంటరి పిల్ల ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడొక క్రేజీ హీరోయిన్..

'బాలు.. ABCDEFG' ఈ సినిమా మీ అందరికీ గుర్తుండొచ్చు. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఈ మూవీలో ఆయనతో కలిసి అల్లరి చేసిన ఓ తుంటరి పిల్ల..

Tollywood: పవన్‌తో అల్లరి చేసిన ఈ తుంటరి పిల్ల ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడొక క్రేజీ హీరోయిన్..
Tollywood
Ravi Kiran
|

Updated on: Apr 13, 2023 | 7:32 PM

Share

‘బాలు.. ABCDEFG’ ఈ సినిమా మీ అందరికీ గుర్తుండొచ్చు. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఈ మూవీలో ఆయనతో కలిసి అల్లరి చేసిన ఓ తుంటరి పిల్ల అప్పట్లో అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలోని స్కూల్ సీన్‌లో ఆమె చిన్ని చిన్ని మాటలతో అప్పట్లో తెగ పాపులారిటీ సంపాదించింది. మరి ఇంతలా ఆకట్టుకున్న ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడొక క్రేజీ హీరోయిన్. ఇటీవల చేసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్స్ అందుకున్నాయి. మరి ఆమెవరో కనిపెట్టారా.? లేదా మీకో క్లూ ఇచ్చేస్తాం. ఈమె మన తెలుగు అమ్మాయే.. తాజాగా ‘బలగం’ అనే చిత్రంలో నటించింది.

ఎస్.! మీరనుకున్నది కరెక్టే.. ఆమె మరెవరో కాదు.. కావ్య కళ్యాణ్ రామ్. ‘గంగోత్రి’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత చిరంజీవి ‘ఠాగూర్‌’, నాగార్జున ‘స్నేహమంటే ఇదేరా’, పవన్ కళ్యాణ్ ‘బాలు’.. లాంటి దాదాపు 16 సినిమాల్లో బాలనటిగా నటించి మెప్పించింది. అనంతరం చదువు కోసం సినిమాలకు దూరమై.. ‘లా’ డిగ్రీ పూర్తి చేసింది.

ఇవి కూడా చదవండి

ఇక తాజాగా ‘మసూద’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఇందులో కావ్య అందం, అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. అలాగే ఇటీవల ‘బలగం’ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. త్వరలోనే ‘ఉస్తాద్‌’ మూవీతో కావ్య హీరోయిన్‌గా ప్రేక్షకులను పలకరించనుంది. కాగా, ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కావ్య కళ్యాణ్ రామ్.. తన లేటెస్ట్ ఫోటోలను నెటిజన్లతో పంచుకుంటూ ఉంటుంది.

Follow Us
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..