800 First Look: ఫస్ట్‌లుక్‌తోనే షాకిచ్చారుగా.. మిస్టరీ స్పిన్నర్ బయోపిక్ ఫొటో చూస్తే ఔరా అనాల్సిందే..
Muttiah Muralitharan Biopic: గ్రేట్ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ పై ఓ సినిమా రూపొందనుంది. సినిమాకు 800 అనే పేరు పెట్టారు. ఇందులో మురళీధరన్ పాత్రలో మధుర్ మిట్టల్ నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ చాలా బలంగా ఉంది.

800 First Look: ప్రపంచ క్రికెట్‌లో దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 51వ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘800’ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ బయోపిక్ త్వరలో థియేటర్లలోకి రానుంది. ఈ బయోపిక్ పేరు ‘800’. ఎందుకంటే ఈ లెజెండరీ స్పిన్నర్ టెస్ట్ క్రికెట్‌లో అత్యధికంగా 800 వికెట్లు పడగొట్టాడు. ఇది ప్రపంచ రికార్డు.
శ్రీలంక గ్రేట్ స్పిన్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌ను ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ మోషన్ పోస్టర్ కూడా విడుదలైంది. మురళీ అభిమానులు ఈ సినిమా కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో ముత్తయ్య మురళీధరన్‌గా నటుడు మధుర్ మిట్టల్ నటించబోతున్నారు. అతని ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రంతో ఆకట్టుకు మధుర్ మరోసారి సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు.




ఈ ఏడాదే విడుదలకు సిద్ధం..
ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ విడుదల తేదీని ప్రకటించలేదు. అయితే పోస్టర్ ప్రకారం, ఇది ఈ సంవత్సరం విడుదల అవుతుందని తెలుస్తోంది. మధుర్ మిట్టల్ ఫస్ట్ లుక్ చూస్తే కచ్చితంగా ముత్తయ్య మురళీధర్ గుర్తుకు వస్తాడు. యవ్వనంలో ఉన్న రోజుల్లో మురళి ఇలాగే ఉండేవాడంట.
మురళీధరన్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్..
MUTHIAH MURALIDARAN BIOPIC: FIRST LOOK POSTER… WILL RELEASE IN 3 LANGUAGES… #MadhurrMittal – who won acclaim for his performance in the #Oscar-winning film #SlumdogMillionaire – will play legendary cricketer #MuthiahMuralidaran in his biopic, titled 800 [#800TheMovie].
Motion… pic.twitter.com/zCvfDHXJ0R
— taran adarsh (@taran_adarsh) April 17, 2023
మురళీధరన్ నేటితో 51వ ఏట అడుగుపెట్టారు. మురళీధరన్‌కి టెస్టు, వన్డే క్రికెట్‌లో 1347 వికెట్లు పడగొట్టాడు. ఇది ఓ ప్రపంచ రికార్డు. మురళీధరన్ టెస్టుల్లో 133 మ్యాచ్‌ల్లో 800 వికెట్లు, వన్డేల్లో 534 వికెట్లు పడగొట్టాడు. ముత్తయ్య మురళీధర్ కాలంలో బ్యాటింగ్ చేసేందుకు బ్యాటర్లు వణికిపోయేవారు. అతని స్పిన్‌తో భయపెట్టేవాడు.
ఈ చిత్రానికి ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. 800 చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో మురళీధరన్‌గా నటించడం పట్ల నటుడు మధుర్ మిట్టల్ సంతోషం వ్యక్తం చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
