Sarath Babu Health: విషమంగానే శరత్ బాబు ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తోన్న వైద్యులు..
వయసు మీద పడటంతో పాటు పలు ఆరోగ్య సమస్యలతో ఆయన ఇబ్బంది బడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం శరత్ బాబు వయసు 72 ఏళ్ళు. చెన్నైలోనే ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నా వైద్యుల సూచనతో ఆయన్ను బెంగళూరుకు తరలించారు.
సీనియర్ నటుడు శరత్ బాబు హెల్త్ కండీషన్ క్రిటికల్ గా ఉందని వైద్యులు తెలిపారు. గత కొద్దిరోజులుగా శరత్ బాబు ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. వయసు మీద పడటంతో పాటు పలు ఆరోగ్య సమస్యలతో ఆయన ఇబ్బంది బడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం శరత్ బాబు వయసు 72 ఏళ్ళు. చెన్నైలోనే ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నా వైద్యుల సూచనతో ఆయన్ను బెంగళూరుకు తరలించారు. ఇప్పుడు హైదరాబాద్ AIGకి మార్చారు. పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెప్తున్నారు.
తాజాగా శరత్ బాబు హెల్త్ కండీషన్ గురించి వైద్యులు అప్డేట్ ఇచ్చారు. శరత్‌బాబు పరిస్థితి ఇంకా విషమం గానే ఉందని వైద్యులు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆయనను వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు వైద్యులు.
250కిపైగా సినిమాల్లో నటించారు. చివరిగా వకీల్‌సాబ్ సినిమాలో కనిపించారు. ఓ పక్క మూవీస్‌లో నటిస్తూనే బుల్లితెరపైనా మంచి పాత్రలు పోషించారు. అనేక తెలుగు, తమిళ టీవీ సీరియళ్లలో నటించారు. ఈ సీనియర్ నటుడు అనారోగ్యానికి గురయ్యారనే వార్త టాలీవుడ్‌లో కలవరాన్ని నింపింది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన కోరుకోవాలని పోస్ట్ లు షేర్ చేస్తున్నారు.