AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siddharth : భారీ సినిమాలో భాగమైన బొమ్మరిల్లు హీరో.. ఇప్పటికైనా సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చేస్తారా..?

క్రేజ్ లేదా అంటే ఉంది.. కానీ ఏం లాభం.. ఆ క్రేజ్ సినిమాలకు వర్కవుట్ అవ్వట్లేదు. చాలా ఏళ్ళ తర్వాత ఓ భారీ సినిమాలో భాగం అవుతున్నారు సిద్ధూ. మరి బొమ్మరిల్లు హీరోకు ఆ పాన్ ఇండియన్ సినిమా అయినా కలిసొస్తుందా..? అసలు సిద్ధార్థ్ చేస్తున్న ఆ సినిమా ఏంటి..? 

Siddharth : భారీ సినిమాలో భాగమైన బొమ్మరిల్లు హీరో.. ఇప్పటికైనా సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చేస్తారా..?
Siddharth
Rajeev Rayala
|

Updated on: Apr 24, 2023 | 10:06 AM

Share

కెరీర్ ఎలా మొదలైంది కాదు.. ఎలా నడుస్తుందనేది కీలకం. ఈ విషయంలో సిద్ధార్థ్‌కు చెప్పుకోలేని కష్టాలు వస్తున్నాయి. క్రేజ్ లేదా అంటే ఉంది.. కానీ ఏం లాభం.. ఆ క్రేజ్ సినిమాలకు వర్కవుట్ అవ్వట్లేదు. చాలా ఏళ్ళ తర్వాత ఓ భారీ సినిమాలో భాగం అవుతున్నారు సిద్ధూ. మరి బొమ్మరిల్లు హీరోకు ఆ పాన్ ఇండియన్ సినిమా అయినా కలిసొస్తుందా..? అసలు సిద్ధార్థ్ చేస్తున్న ఆ సినిమా ఏంటి..?

కొందరు హీరోలకు సింగిల్ సినిమాతో వచ్చిన ఇమేజ్.. ఎప్పటికీ పోదు. సిద్ధార్థ్‌కు సైతం అలాంటి బలమైన ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా బొమ్మరిల్లు. బాయ్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరవైన ఈ హీరో.. ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానాతో సడన్ స్టార్ అయిపోయారు. ఇక బొమ్మరిల్లుతో సిద్ధూ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. 15 ఏళ్ళ కింద.. టాలీవుడ్‌లో చాలా మంది హీరోలకు లేని క్రేజ్ సిద్ధూ సొంతం. బొమ్మరిల్లు తర్వాత సిద్ధూ మార్కెట్ చూసి.. ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చిన హీరోకు ఇంత క్రేజ్ ఏంటో అని మన హీరోలు కూడా కుళ్లుకునే ఉంటారు. కానీ బొమ్మరిల్లుతోనే సిద్ధూ రేంజ్ ఆగిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఆ తర్వాత చేసిన ఆట, బావ, ఓ మై ఫ్రెండ్ నిరాశ పరిచాయి. కొంచెం ఇష్టం కొంచెం కష్టం మాత్రమే పర్లేదనిపించింది.

రెండేళ్ళ కింద మహాసముద్రం సినిమాతో టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇచ్చారు సిద్ధార్థ్. అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ చిత్రం డిజాస్టర్ అయింది. దాంతో సిద్ధూకు కలిసొచ్చిందేం లేదు. ఇలాంటి సమయంలో ఇండియన్ 2పైనే సిద్ధార్థ్ ఆశలున్నాయి. కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సిద్ధు కీలక పాత్రలో నటిస్తున్నారు. బాయ్స్ తర్వాత శంకర్ దర్శకత్వంలో సిద్ధూ నటిస్తున్న సినిమా ఇది. మరి ఇదైనా ఆయన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందా చూడాలిక.

తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి