AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sachin’s Birthday: ఊహించని శుభాకాంక్షలు.. సచిన్‌ని విష్ చేసిన Triple H.. ‘మై ఫ్రెండ్’ అంటూ..

Sachin's Birthday: ప్రపంచ క్రికెట్ లెజెండ్, క్రికెట్ గాడ్, లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈ రోజు తన 50వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో సచిన్‌కి అర్థరాత్రి నుంచే దేశవిదేశాలలోని పలువురు మాజీలు, యాక్టివ్ క్రికెటర్లు, నటీనటులు, ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా..

Sachin's Birthday: ఊహించని శుభాకాంక్షలు.. సచిన్‌ని విష్ చేసిన Triple H.. ‘మై ఫ్రెండ్’ అంటూ..
Triple H Wishes Sachin Tendulkar On His 50th Birthday
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 24, 2023 | 12:47 PM

Share

Sachin’s Birthday: ప్రపంచ క్రికెట్ లెజెండ్, క్రికెట్ గాడ్, లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈ రోజు తన 50వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో సచిన్‌కి అర్థరాత్రి నుంచే దేశవిదేశాలలోని పలువురు మాజీలు, యాక్టివ్ క్రికెటర్లు, నటీనటులు, ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా డబ్ల్యూడబ్ల్యూఈ(WWE) మాజీ రెజ్లర్, ప్రస్తుత క్రియేటివ్ హెడ్, చీఫ్ కంటెంట్ ఆఫీసర్ ట్రిపుల్ హెచ్‌ కూడా సచిన్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. అందుకు సంబంధించిన వీడియోను sonysportsnetwork, wweindia ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు సంయుక్తంగా షేర్ చేశాయి. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. 

సచిన్‌కి ట్రిపుల్ హెచ్ తెలియజేస్తూ ‘సచిన్, లిటిల్ మాస్టర్, మై ఫ్రెండ్.. డబ్ల్యూడబ్ల్యూఈ యూనివర్సిటీ తరఫున 50వ పుట్టిన రోజు శుభాకాంక్షలు. మరో మైలురాయిని చేరుకున్నారు.  క్రికెట్ మైదానికి లోపల, బయట కూడా మీరు ఈ తరానికి నువ్వు స్ఫూర్తిగా నిలిచారు’ అంటూ చెప్పుకొచ్చాడు. దీనిపై నెటిజన్లు కూడా ‘హ్యప్పీ బర్తడే సచిన్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే ‘ఇది ఊహించలేదు అసలు’ అంటూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..