Women’s Health: ఈ విత్తనాలను తీసుకుంటే చాలు.. PCOS సమస్య నుంచి ఉపశమనం ఖాయం..

Women's health: ఈ మధ్య కాలంలో జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, ఫాస్ట్‌ఫుడ్‌ని ఎక్కువగా తీసుకోవడం కారణంగా చాలా మంది స్త్రీలు పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ సమస్యలకు లోనవుతున్నారు. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్/డిసీస్ (PCOS/PCOD) అనేది స్త్రీలలో కనిపించే ఋతు సమస్య. శరీరంలో..

Women's Health: ఈ విత్తనాలను తీసుకుంటే చాలు.. PCOS సమస్య నుంచి ఉపశమనం ఖాయం..
Health Tips
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 24, 2023 | 10:41 AM

Women’s health: ఈ మధ్య కాలంలో జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, ఫాస్ట్‌ఫుడ్‌ని ఎక్కువగా తీసుకోవడం కారణంగా చాలా మంది స్త్రీలు పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ సమస్యలకు లోనవుతున్నారు. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్/డిసీస్ (PCOS/PCOD) అనేది స్త్రీలలో కనిపించే ఋతు సమస్య. శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఉన్నప్పుడే ఇలాంటి బుతు సమస్యలన్నీ పెరుగుతాయి. ముఖ్యంగా కరోనా లాక్‌డౌన్ తర్వాత ఈ సమస్య మరింతగా పెరిగింది. ప్రస్తుతం 60 కంటే ఎక్కువ శాతం మంది మహిళలు పీసీఓఎస్‌ సమస్యతో బాధపడుతున్నారు. ఇక ఈ సమస్యతో బాధపడేవారిలో బరువు పెరగడం. పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, జుట్టు రాలడం, చర్మం గరుకుగా ఉండడం వంటి వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. చాలా సందర్భాలలో హార్మోన్ల అసమతుల్యత ఈ సమస్యకు ప్రధాన కారణం. కొన్ని సందర్భాల్లో ఈ సమస్య జన్యుపరమైనది కూడా అయ్యే అవకాశం ఉంది. ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది ఒక్కసారి ఎదురైతే దానికి విరుగుడు లేదు. అయితే జీవనశైలిని మార్చుకోవడం ద్వారా ఈ సమస్యను నియంత్రించుకోవచ్చు. జీవినశైలి మార్పులు అంటే తినే ఆహారంలో మార్పులు, సరిపడినంత శారీరక శ్రమ వంటివి చేయాలి. ఈ క్రమంలో తీసుకునే ఆహారంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అలాగే కొన్ని రకాల విత్తనాలు పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ వంటి ఋతు సమస్యలకు చెక్ పెట్టగలవు. మరి ఈ సమస్యను నియంత్రించే విత్తనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

చియా విత్తనాలు: చియా విత్తనంలో 20 శాతం ప్రొటీన్లు, 60 శాతం ఒమేగా త్రీ యాసిడ్లు ఉంటాయి. ఇవి స్త్రీ శరీరంలోని ఈస్ట్రోజన్  స్థాయిలను నియంత్రిస్తాయి, ఇంకా గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

మెంతులు: కొలెస్ట్రాల్, హార్మోన్ నియంత్రణకు మెంతులు సరిగ్గా పనిచేస్తాయి. ఇందులో ఉంబే సపోనిన్లు, ఫ్లేవనాయిడ్లు జీవక్రియ రేటును మెరుగుపరచడంతో పాటు శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను నియంత్రిస్తాయి.

ఇవి కూడా చదవండి

గుమ్మడి గింజలు: బీటా-సిటోస్టెరాల్ పుష్కలంగా ఉండే గుమ్మడి గింజలు శరీరంలో టెస్టోస్టెరాన్ స్రావాన్ని నియంత్రిస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా అదుపులో ఉంచుతాయి

అవిసె గింజలు: అవిసె గింజలు శరీరంలోని ఆండ్రోజెన్‌ల పరిమాణాన్ని నియంత్రించి స్త్రీ శరీరంలో హార్మోన్ల స్రావాన్ని తగ్గిస్తాయి.

పొద్దుతిరుగుడు విత్తనాలు: పొద్దుతిరుగుడు విత్తనాలు PCOS నియంత్రణలో సహాయపడతాయి. ఇందులో విటమిన్ ఇ, మెగ్నీషియం, సెలీనియం ప్రొజెస్టెరాన్ స్రావాన్ని నియంత్రించేందుకు ఉపకరిస్తాయి.

గసగసాలు: గసగసాల్లో ఉండే కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ బి, జింక్ శరీరంలోని పిసిఒఎస్‌తో పోరాడటానికి సహాయపడతాయి. ఇంకా హర్మోన్ల స్థాయిని నియంత్రిస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!