Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేసవిలో కూల్ డ్రింక్స్ తాగి రోగాలు తెచ్చుకునే బదులు.. ఇంట్లోనే సులభంగా ఈ 5 డ్రింక్స్ తయారు చేసుకోండి..

వేసవికాలం వచ్చేసింది ఎండల వేడిని తరిమెందుకు జనం ఎక్కువగా చల్లటి పానీయాలను తాగేందుకు ఇష్టపడుతుంటారు.

వేసవిలో కూల్ డ్రింక్స్ తాగి రోగాలు తెచ్చుకునే బదులు.. ఇంట్లోనే సులభంగా ఈ 5 డ్రింక్స్ తయారు చేసుకోండి..
Summer Drinks
Follow us
Madhavi

| Edited By: Ravi Kiran

Updated on: Apr 25, 2023 | 8:30 AM

వేసవికాలం వచ్చేసింది ఎండల వేడిని తరిమెందుకు జనం ఎక్కువగా చల్లటి పానీయాలను తాగేందుకు ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా కూల్డ్రింక్స్ అలాగే ఐస్ క్రీములు తినేందుకు కూడా జనం ఎక్కువగా ఇష్టపడే అవకాశం ఉంది. కానీ కూల్ డ్రింక్స్ తాగడం ద్వారా మీ ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది ముఖ్యంగా డయాబెటిస్ రోగులు కూల్ డ్రింక్ తాగితే ఒక్కసారిగా అమాంతం ఒంట్లో చక్కెర శాతం పెరిగిపోతుంది. అంతేకాదు ఐస్ క్రీములు తినడం ద్వారా కూడా శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వేసవికాలంలో పిల్లలు పెద్దలు ఆరోగ్యకరంగా ఉంటూనే ఎంజాయ్ చేయగలిగే ఇంట్లోనే తయారు చేసుకోగలిగే ఐదు సులభమైన పానీయాల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

నిమ్మకాయ రసం:

నిమ్మకాయ రసం లేదా నిమ్మకాయ శబ్దం వేసవికాలంలో ప్రతి ఒక్కరి ఛాయిస్ గా ఉంటుంది. రెండు నిమ్మకాయ బద్దలను పూర్తిగా క్లాసులో పిండి అందులో నీరు పోసి కాస్త ఉప్పు కాస్త పంచదార కలిపి తాగితే ఆ మజానే వేరు. ఈ నిమ్మకాయ నీరులో కొద్దిగా జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేసుకొని తాగితే మరింత రుచికరంగా ఉంటుంది. అయితే నిమ్మకాయ రసం తాగడం ద్వారా శరీరానికి కావలసిన విటమిన్ సి అలాగే అవసరమైనటువంటి పోషకాలు మినరల్స్ లభిస్తాయి అలాగే ఎండ వేడిని ద్వారా శరీరం కోల్పోయే నీటిని కూడా భర్తీ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

చల్లటి మజ్జిగ:

వేసవికాలంలో మజ్జిగను మించిన పానీయం లేదు. కాస్త కొద్దిగా పెరుగులో రెండింతలు నీరు పోసి కొద్దిగా ఉప్పు వీలుంటే నిమ్మకాయ పిండుకొని కొద్దిగా కొత్తిమీర చల్లి తాగితే గొంతుతో పాటు కడుపుకు కూడా చల్లటి ఫీలింగ్ కలుగుతుంది. మజ్జిగలో మన శరీరానికి ఎంతో అత్యవసరమైన గట్ బ్యాక్టీరియా ఉంటుంది. మజ్జిగ ద్వారా శరీరానికి అనేక పోషకాలు లభిస్తాయి. అంతే కాదు ఎండలో వడదెబ్బ తగలకుండా కాపాడటంలో మజ్జిగ అమృతం లాంటిది.

రాగి జావా:

రాగుల్లో ఉన్న పోషకాలు మరే ఇతర ధాన్యాల్లోనూ కనిపించవు.. అందుకే వేసవిలో రాగిజావను మించిన పానీయం మరొకటి ఉండదు. . రాగి పిండిని చల్లటి నీళ్లలో కలిపి దాన్ని ఉడకబెట్టి. ఆ తర్వాత అందులో మజ్జిగ కలుపుకొని కొద్దిగా నిమ్మకాయ పిండుకొని, ఉప్పు, వేసుకుని తాగితే టేస్ట్ అదిరిపోవడం ఖాయం. రాగుల్లో ఐరన్, ప్రోటీన్, విటమిన్ బి12 అనేక మినరల్స్ ఉంటాయి. వేసవిలో బెస్ట్ డ్రింక్ రాగి జావ.

బార్లీ నీళ్లు:

బార్లీ గింజలను నానబెట్టి అనంతరం దాన్ని ఉడకబెట్టి, చల్లారిన తరువాత ఆ మిశ్రమంలో నీరు పోసి నిమ్మకాయ పిండుకొని రుచికి కొద్దిగా పంచదార కలుపుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా కిడ్నీ వ్యాధులు ఉన్నవారికి బార్లీ నీళ్లు అమృతంతో సమానం.

లస్సి:

వేసవికాలంలో చల్లటి లస్సి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. లస్సిని తాగేందుకు సాధారణంగా పంజాబీలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అదే విధంగా ఉత్తర భారత దేశంలో కూడా లస్సి చాలా ఫేమస్ డ్రింక్. లస్సీని గడ్డ పెరుగుతో తయారుచేస్తారు. మంచి దేశీ గడ్డపెరుగును బాగా చిలికి అందులో పంచదార వేసి ఈ లస్సీ పానీ అని తయారు చేస్తారు. ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి కావున ఆరోగ్యానికి చాలా మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్  వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..