- Telugu News Photo Gallery IRCTC Munnar and Kochin Tour Package starts from 8 Thousand, check here for full details
IRCTC Tour: సెలవులలో టూర్ ప్లాన్ చేస్తున్నారా..? అతి తక్కువ ఖర్చుతోనే పచ్చని కొండలు, బ్యాక్ వాటర్స్ అందాలను చూసేయండిలా..
IRCTC Tour Package: పచ్చని పర్యావరణం, బ్యాక్ వాటర్‌లకు ప్రసిద్ధి. ఆ కారణంగానే కేరళ టూరిజం అద్బుతమైన ప్రజాధరణను సొంతం చేసుకుంది. ఇక్కడ ఉండే బోట్ హౌస్‌లను, కొబ్బరిచెట్ల సముదాయాలను చూసేందుకు కూడా పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. అలా కేరళను సందర్శించాలనే ప్లాన్ చేస్తున్నవారి కోసం IRCTC ఒక గొప్ప టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది.
Updated on: Apr 25, 2023 | 6:56 AM

కేళలలలోని మున్నార్, కొచ్చి అత్యంత ప్రసిద్ధ పర్యాటక గమ్యస్థానాలలో ప్రముఖమైనవి. ఈ రెండు ప్రదేశాలు ప్రకృతి సౌందర్యానికి, చారిత్రక ప్రదేశాలకు, విశిష్ట సంస్కృతికి ప్రసిద్ధి. మరి వాటిని చూసేందుకు మీరు కూడా ప్లాన్ చేస్తున్నట్లయితే ఓ సారి IRCTC టూర్ ప్యాకెజీని చూసేయండి.

IRCTC మున్నార్-కొచ్చి టూర్ ప్యాకేజీ ఏప్రిల్ 29 నుంచి ప్రారంభమవుతుంది. మున్నార్ దాని విస్తారమైన తేయాకు తోటలకు ప్రసిద్ధి చెందింది. ఇంకా మీరు ఇక్కడ అందమైన పచ్చని కొండలు, లోయల అద్భుతమైన దృశ్యాన్ని చూడవచ్చు.

ఈ ప్యాకేజీ రూ.8,445 నుంచి ప్రారంభమవుతుంది. IRCTC ఈ టూర్ ప్యాకేజీ ద్వారా 3 పగళ్లు, 2 రాత్రుల పర్యటన సాగుతుంది. పర్యాటకులను ఒకరోజు మున్నార్‌కు తీసుకువెళ్లి, మరుసటి రోజు కొచ్చికి వెళ్లేలా IRCTC ప్లాన్ చేసింది.

మీరు కేరళకు గర్వకారణంగా పిలువబడే బ్యాక్ వాటర్స్‌ను కూడా కొచ్చిలో చూడవచ్చు. ఇదే కాకుండా మీరు ఇక్కడ సరస్సు, నదులలోని హౌస్ బోట్ అందాలను కూడా చూడవచ్చు. మీరు ఇక్కడ కొచ్చి కోటను కూడా సందర్శించవచ్చు.

వాస్తవానికి కేరళలోని కొచ్చి, మున్నార్ వేసవి సెలవులను గడపడానికి ఉత్తమమైన ప్రదేశాలు. ఉత్తర భారతదేశంలోని మండుతున్న వేడి నుంచి ఉపశమనం పొందడానికి మీరు ఇక్కడ కొంత సమయం తప్పక గడపవచ్చు.





























