Sachin’s Birthday: సరికొత్తగా సచిన్‌కు శుభాకాంక్షలు.. నెట్టింట వైరల్ అవుతున్న సెహ్వాగ్ వీడియో.. ఏం చేశాడంటే..?
Sachin Tendulkar's Birthday: ‘క్రికెట్ గాడ్’, ‘లిటిల్ మాస్టర్’ అంటూ ఫ్యాన్స్ అభిమానంగా పిలుచుకునే సచిన్ టెండూల్కర్ ప్రపంచ క్రికెట్ దిగ్గజాలలో ఒకరు. ఇక సోమవారం సచిన్ తన 50వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అర్థరాత్రి నుంచే పలువురు మాజీలు, టీమిండియా..
Sachin Tendulkar’s Birthday: ‘క్రికెట్ గాడ్’, ‘లిటిల్ మాస్టర్’ అంటూ ఫ్యాన్స్ అభిమానంగా పిలుచుకునే సచిన్ టెండూల్కర్ ప్రపంచ క్రికెట్ దిగ్గజాలలో ఒకరు. ఇక సోమవారం సచిన్ తన 50వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అర్థరాత్రి నుంచే పలువురు మాజీలు, టీమిండియా క్రికెటర్లు, నటీనటులు, ప్రముఖులతో సహా అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే సచిన్‌కి అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనింగ్ పార్ట్నర్ అయిన విరేంద్ర సెహ్వాగ్ కూడా తనదైన రీతిలో శుభాకాంక్షలు తెలిపాడు. శీర్షాసనం వేసి సచిన్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్న వీడియోను తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు.
అయితే ఆ వీడియోలో సచిన్ చెప్పిన మాటలను తాను వినలేదని, ఆయన ఇచ్చిన సలహాలకు రివర్స్‌గా ఆడేవాడినంటూ పేర్కొన్నాడు. ఇంకా ‘మైదానంలో మీరు ఏది చెప్పినా దానికి రివర్స్‌గానే చేశా. ఈ రోజు మీరు 50వ పుట్టినరోజు జరుపుకుంటోన్న వేళ శీర్షాసనం వేసే శుభాకాంక్షలు చెప్పాలి. వేయ్యేళ్లు మీరు వర్థిల్లాలి’ అంటూ విరేంద్ర సెహ్వాగ్ తన ట్వీట్‌కి క్యాప్షన్ రాసుకొచ్చాడు.
Maidaan par jo aapne kaha , uska ulta hi kiya, toh aaj aapke iconic 50th birthday par toh aapko Shirshasana karke wish karna hi tha.
Wish you a very happy birthday @sachin_rt Paaji , aap jiyo hazaaron saal , Saal ke din ho ek crore. #HappyBirthdaySachin pic.twitter.com/awvckIAqc9
— Virender Sehwag (@virendersehwag) April 23, 2023
కాగా టీమిండియా తరఫున ఆడిన క్రికెట్ దిగ్గజాలలో వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ కూడా ప్రముఖులు. ముఖ్యంగా వీరిద్దరు కలిసి టీమిండియాకు ఓపెనర్లుగా ఆడటమే కాక ప్రత్యర్థులపై విధ్వంసం సృష్టించిని సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక వీరిద్దరు కలిసి మొత్తం 93 వన్డే ఇన్నింగ్స్‌లలో టీమిండియాకి ఓపెనర్లుగా ఆడారు. అలా ఇద్దరు కలిసి 42.13 సగటుతో 3919 పరుగులు చేశారు. వీటిలో 12 సెంచరీ భాగస్వామ్యాలు, 18 యాభై పార్ట్నర్‌షిప్‌లు కూడా ఉన్నాయి.
మరిన్ని తాజా క్రికెట్ అప్‌డేట్ల కోసం క్లిక్ చేయండి.