యూకేలో మాజీ భార్యకు వాటా ఇవ్వాల్సివస్తుందని ఇల్లు తగులబెట్టుకున్నాడు… కోర్టు ఏ శిక్ష విధిస్తుందో..?

బ్రిటన్ లో 75 ఏళ్ళ ఓ ముసలాయన తన మాజీ భార్యకు తమ ఇల్లు అమ్మేస్తే వచ్చే డబ్బులో వాటా ఇవ్వాల్సివస్తుందని సొంత ఇంటినే తగులబెట్టుకున్నాడు.

యూకేలో మాజీ భార్యకు వాటా ఇవ్వాల్సివస్తుందని ఇల్లు తగులబెట్టుకున్నాడు... కోర్టు ఏ శిక్ష విధిస్తుందో..?
Man Burns Down House
Umakanth Rao

| Edited By: Phani CH

Jun 27, 2021 | 4:20 PM

బ్రిటన్ లో 75 ఏళ్ళ ఓ ముసలాయన తన మాజీ భార్యకు తమ ఇల్లు అమ్మేస్తే వచ్చే డబ్బులో వాటా ఇవ్వాల్సివస్తుందని సొంత ఇంటినే తగులబెట్టుకున్నాడు. తనతో విడిపోతున్న ఆమెకు ఈ సొమ్ములో షేర్ మాత్రం ఎందుకని మెక్ కర్రీ అనే ఈయన ఈ నిర్వాకానికి దిగాడు. అంతే ! ఐదున్నర లక్షల పౌండ్ల ఖరీదైన ఇంటిని బ్లో టార్చ్ తో దగ్ధం చేశాడు. ఈ ఇంటిని అమ్మేద్దామని ఇటీవల అనుకున్నారట.. అమ్మితే వచ్చే డబ్బులో సగం నీకు సగం నాకు అని కూడా ఇద్దరూ ఓ అగ్రిమెంటుకు కూడా వచ్చారట. కానీ చివరి క్షణంలో కర్రీ ఒకటే వర్రీ అయిపోతూ…అసలు ఆ సొమ్ము తనకు..ముఖ్యంగా తనకు దూరం కావాలనుకుంటున్న హిల్లరీ అనే తన మాజీ భార్యకు దక్కరాదనుకుని చక్కని ఇంటిని కాస్తా నిప్పుల పాల్జేశాడు. మొదట ఇది యాక్సిడెంటల్ గా కాలిపోయిందనుకున్నారు పోలీసులు..కానీ అసలు విషయం ఆ తరువాత వారికి తెలిసింది. ఆయనతో నేను విడిపోతున్నందుకు ఆగ్రహంతో ఆయనే ఇల్లును దగ్ధం చేశాడని అనుమానిస్తున్నానని హిల్లరీ వారికి చెప్పింది. పోలీసులు కూడా ఈ వాదనను నమ్మినట్టే ఉన్నారు.

మెక్ కర్రీని అరెస్టు చేస్తే….. అవును..నేనే బ్లో టార్చ్ తో ఈ నిర్వాకానికి పాల్పడ్డానని ఒప్పుకున్నాడు.. ఈ పెద్దాయనను పోలీసులు కోర్టులో హాజరు పరచగా… హిల్లరీకి డైవోర్స్ ఇవ్వాలని తను ఎప్పుడూ భావించలేదని, అసలా ఉద్దేశమే తనకు లేదని చెప్పాడు. అయినా మద్యం తాగిన మత్తులో ఇంటిని తగులబెట్టానని, హిల్లరీపై తనకెలాంటి కోపం లేదని చెప్పాడట.. జస్ట్ అప్ సెట్ అయ్యా అంతే అన్నాడు. మొత్తానికి బంగారం లాంటి ఇల్లు కాస్తా పూర్తిగా కాలిపోయింది. ఆ ఇంటికి ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం కూడా లేదు.. మరి కోర్టు ఈ ఈయనకు ఏ శిక్ష విధిస్తుందో ..?

మరిన్ని  ఇక్కడ చూడండి: Vaccine Certificate: విదేశాల‌కు వెళ్లే వారికి ముఖ్య గ‌మనిక‌.. వ్యాక్సిన్ స‌ర్టిఫికేట్ త‌ప్ప‌నిస‌రి. ఎలా పొందాలంటే..

పురాతన ఈజిప్ట్ మమ్మీలపై రహస్యాల ఛేదన… ఆధునిక సిటీ స్కాన్ పరీక్షలు… ( వీడియో )

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu