Madagascar: ఘోరమైన హెలికాప్టర్ ప్రమాదం.. 12 గంటలు ఈదుకుంటూ ఒడ్డుకు చేరిన మంత్రి..
ఆయన వయస్సు 57 ఏళ్లు. ఎక్కడో సముద్రం మధ్యలో పడిపోయాడు. ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. కానీ 12 గంటల్లో ఓ అద్భుతం జరిగింది. ఏంటది? ప్రయాణికుల పడవ మునిగిపోవడంతో ఆ ప్రదేశాన్ని పరిశీలించడానికి ఓ బృందం..
ఆయన వయస్సు 57 ఏళ్లు. ఎక్కడో సముద్రం మధ్యలో పడిపోయాడు. ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. కానీ 12 గంటల్లో ఓ అద్భుతం జరిగింది. ఏంటది? ప్రయాణికుల పడవ మునిగిపోవడంతో ఆ ప్రదేశాన్ని పరిశీలించడానికి ఓ బృందం వెళ్లింది. దురదృష్టవశాత్తు పరిశీలన బృందం వెళ్లిన హెలీకాప్టర్ కూడా కుప్పకూలింది. అసలు విషయం ఏంటంటే, కూలిన హెలీకాప్టర్‌లో ఓ మంత్రి ఉన్నారు. ఇదంతా మడగాస్కర్‌లో జరిగింది. సముద్రంలో హెలీకాప్టర్ కూలిపోవడంతో తాను 12 గంటల పాటు ఈదుకుంటూ ప్రాణాలతో బయటపడ్డానని చెప్పారు మడగాస్కర్‌కు చెందిన ఒక మంత్రి. రెస్క్యూ మిషన్ సందర్భంగా తమకు ఈ ప్రమాదం జరిగిందని తెలిపారాయన.
హెలీకాప్టర్‌లో మడగాస్కర్ హోంమంత్రి సెర్జె గెలె తోపాటు ప్రయాణించిన మరో ఇద్దరు భద్రతా సిబ్బంది ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. సెర్జె గెలె ప్రస్తుతం కోలుకుంటున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ ఘటన పట్ల ప్రెసిడెంట్ ఆండ్రీ రాజోలీనా ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారితో పాటు గెలె, మిగతా ఇద్దరు అధికారులకు కూడా నివాళులర్పించారు మడగాస్కర్ ప్రెసిడెంట్.
కానీ ఈ ముగ్గురు ఈదుకుంటూ విడివిడిగా సముద్ర తీర ప్రాంతం మహాంబోకు చేరుకున్నారు. హెలీకాప్టర్ కూలిపోవడానికి కారణాలు ఇంకా తెలియలేదు. ప్రమాదం జరిగిన తర్వాత రాత్రి ఏడున్నర గంటల నుంచి ఉదయం ఏడున్నర వరకు ఈదుకుంటూ వచ్చినట్లు తెలిపారు గెలె. తనకు ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారాయన.
తన కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, ప్రభుత్వ అధికారులు చూసే విధంగా ఈ వీడియోను ప్రసారం చేయాలని కోరారు గెలె. తాను బతికే ఉన్నానని, క్షేమంగా ఉన్నానని చెప్పారాయన. హెలీకాప్టర్‌లోని ఒక సీటును నీటిపై తేలడానికి గెలె ఉపయోగించుకున్నారని తెలిపారు పోలీస్ చీఫ్ జఫిసంబత్రా రావోవీ. పడవ మునక ప్రమాదంలో కనీసం 39 మంది మరణించారని అనుమానిస్తున్నారు అక్కడి అధికారులు.
♦️Le GDI Serge GELLE, un des passagers de l’hélicoptère accidenté hier a été retrouvé sain et sauf ce matin du côté de Mahambo. ☑️ Les sapeurs sauveteurs de la #4°UPC ont également retrouvé le carcasse de l’hélicoptère au fond de la mer. pic.twitter.com/sP2abwTMwB
— Ministère de la Défense Nationale Madagascar (@MDN_Madagascar) December 21, 2021
ఇవి కూడా చదవండి: Pralay Missile: చైనా గుండెల్లో వణుకుపుట్టిస్తున్న ప్రళయ్.. భారత క్షిపణి పరీక్ష విజయవంతం..