AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Los Angeles fires: లాస్‌ ఏంజిల్స్‌ కార్చిచ్చు వేళ కరుణించిన వరుణుడు.. అయితే ఇక్కడే మరో ముప్పు

అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో కార్చిచ్చు వేళ వరుణుడు కరుణించాడు. మంటలు మరింత విస్తరించకుండా కాలిఫోర్నియాలో కురిసిన వర్షం కాపాడుతుందని అమెరికా అధికార యంత్రాంగం భావిస్తోంది. అయితే ఇక్కడే కొత్త చిక్కు వచ్చిపడింది. కాలుష్య కారకాలతో కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో ఫైర్‌ఫైటర్స్ అలెర్టయ్యారు.

Los Angeles fires: లాస్‌ ఏంజిల్స్‌ కార్చిచ్చు వేళ కరుణించిన వరుణుడు.. అయితే ఇక్కడే మరో ముప్పు
Los Angeles Fires
Ram Naramaneni
|

Updated on: Jan 26, 2025 | 9:44 PM

Share

అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లోని వేల భవనాలు, భారీ విస్తీర్ణంలో అడవులు కార్చిచ్చుకు కాలి బూడిదై పోతున్నాయి. కార్చిచ్చు ప్రభావాన్ని తగ్గించేందుకు అగ్నిమాపక బృందాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వేళ వరుణుడు కాస్త ఉపశమనం కల్పించాడు. కార్చిచ్చు ప్రభావిత దక్షిణ కాలిఫోర్నియాలో ఈ సీజన్‌లో తొలి వర్షం నమోదైంది. దాంతో.. కొత్తగా మంటలు చెలరేగకుండా వర్షం దోహదపడుతుందని అమెరికా అధికారులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో కాలిపోయిన కొండప్రాంతాల నుంచి వచ్చే విషపూరిత బూడిద ప్రవాహం కొత్త సమస్యలు తెచ్చిపెట్టే ప్రమాదముందనే ఆందోళన మొదలైంది. అగ్ని ప్రభావిత ప్రాంతాల్లో వృక్షాలను తొలగించడం, ధ్వంసమైన రోడ్లను బాగు చేయడం వంటి పనుల్లో లాస్‌ ఏంజిల్స్‌ కౌంటీ సిబ్బంది నిమగ్నమయ్యారు. ఈ ప్రాంతంలో వర్షం పడనున్నట్లు వాతావరణశాఖ ప్రకటించింది. కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో శనివారం రాత్రి చిన్నపాటి వర్షం మొదలుకాగా.. మరో మూడు రోజులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ పరిణామంతో కొన్ని వారాలుగా కార్చిచ్చు కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతోన్న అనేక ప్రాంతాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి.

అయితే.. కొండప్రాంతాల్లో క్లౌడ్‌ బరస్ట్స్‌ సంభవిస్తే శిథిలాలు, బూడిద వంటివి దిగువ ప్రాంతాలను ముంచెత్తే ప్రమాదం ఉందని, దీనికి సంబంధించి రెడీగా ఉండాలని అమెరికా నేషనల్‌ వెదర్‌ సర్వీస్‌ వెల్లడించింది. ముఖ్యంగా కార్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, బ్యాటరీలు, భవన నిర్మాణ సామగ్రి, ఫర్నీచర్లతో పాటు ఇతర వస్తువుల్లో ఉండే రసాయన పదార్థాలు, ఆస్బెస్టాస్‌, ప్లాస్టిక్‌, సీసం వంటివి పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపనున్నాయనే ఆందోళన కొనసాగుతోంది. ఈక్రమంలోనే.. కాలుష్య కారకాల ప్రభావాన్ని తగ్గించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..