UK PM Race: బ్రిటన్ ప్రధాని రేసులో వెనుకపడిన రిషి సునాక్‌.. 90 శాతం విజయావకాశాలు ఆమెకేనట..!

ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటినుంచి ఎంపీల అనూహ్య మద్దతుతో రిషి సునాక్ (Rishi Sunak) ప్రధాని రేసులో ముందు నిలిచారు. అయితే తర్వాత పరిస్థితులు మారిపోయాయి. రిషిని వెనక్కి నెట్టి ముందుకొచ్చారు లిజ్‌ ట్రస్‌..

UK PM Race: బ్రిటన్ ప్రధాని రేసులో వెనుకపడిన రిషి సునాక్‌.. 90 శాతం విజయావకాశాలు ఆమెకేనట..!
Rishi Sunak Liz Truss
Follow us

|

Updated on: Jul 31, 2022 | 6:28 AM

Britan PM Race: బ్రిట‌న్ ప్రధాని ప‌ద‌వికి జ‌రుగుతున్న ఎన్నికల్లో మొదట్లో జోరుమీద కనిపించిన భారత సంతతి నేత రిషి సునాక్‌ ఇప్పుడు చాలా వెనుకబడిపోయారు. ఇన్ఫోసిస్‌ ఫౌండర్‌ నారాయణమూర్తి అల్లుడైన రిషి బ్రిటన్‌ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటినుంచి ఎంపీల అనూహ్య మద్దతుతో రిషి సునాక్ (Rishi Sunak) ప్రధాని రేసులో ముందు నిలిచారు. అయితే తర్వాత పరిస్థితులు మారిపోయాయి. రిషిని వెనక్కి నెట్టి ముందుకొచ్చారు లిజ్‌ ట్రస్‌.. ప్రస్తుతం 90 శాతం విజయావకాశాలు లిజ్ ట్రస్ (Liz Truss) కే ఉన్నాయని అంచనాలు చెబుతున్నాయి. ప్రధాని ప‌ద‌వికి బోరిస్ జాన్సన్‌ రాజీనామా చేయ‌డంతో ప్రస్తుత ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. జాన్సన్‌ క్యాబినెట్‌లో మంత్రులుగా ప‌ని చేసిన రిషి, లిజ్ ట్రస్‌ ప్రధాని పదవికి పోటీపడుతున్నారు. ముందు రిషికి విజయావకాశాలు ఎక్కువగా కనిపించినా, తర్వాత లిజ్‌ ట్రస్‌ పైచేయి సాధించారు. ఇద్దరి మధ్య 60-40 శాతం రేటింగ్ ఉందని.. అయితే అసమానత లిజ్ ట్రస్ కు అనుకూలంగా కొనసాగుతూనే ఉందని స్మార్కెట్స్‌లోని పొలిటికల్ మార్కెట్స్ అధిపతి మాథ్యూ షాడిక్ బ్లూమ్‌బెర్గ్‌తో పేర్కొన్నారు. రిషి సునాక్ మంచి ప్రచారకుడని చాలామంది అంచనా వేశారు, కానీ ట్రస్ ప్రదర్శనలు అంచనాలను అధిగమించాయని.. బెట్టింగ్ ఎక్స్చేంజ్ సంస్థ స్మార్కెట్ తెలిపింది. తాజా అంచనాలతో సునాక్ ప్రధాని అయ్యే అవకాశాలు 10 శాతానికి పడిపోయారని స్మార్కెట్ తెలిపింది.

కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీలతో పాటు సభ్యుల మద్దతు దక్కిన వారే పార్టీ అధ్యక్షులుగా, ప్రధానిగా బాధ్యతలు చేపడతారు. దీంతో వారి మద్దతు కోరేందుకు రిషి, ట్రస్‌ దేశమంతా పర్యటిస్తున్నారు. ఇప్పటికే పలు నగరాల్లో ముఖాముఖి చర్చల్లో పాల్గొన్నారు. వారి మధ్య పోరు దాదాపు తుది దశకు చేరుకుంది. వచ్చే వారం నుంచి పార్టీ ఓటర్లకు బ్యాలెట్‌ పత్రాలు పంపిణీ కానున్నాయి. సెప్టెంబర్‌ 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఓటు వేసిన బ్యాలెట్లను సమర్పించాల్సి ఉంటుంది. సెప్టెంబర్‌ 5న ఫలితాలు వెలువడుతాయి. ప్రస్తుతం అర్హులైన కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యుల సంఖ్య 1,75,000గా ఉంది. పార్టీలో ఎంపీల మద్దతు రిషికి ఉన్నా సభ్యుల్లో ఎక్కువమంది లిజ్‌ ట్రస్‌వైపు మొగ్గు చూపుతున్నట్లు పలు అంచనాలు వెలువడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!