AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron Variant: ఆంక్షలున్నప్పటికీ అందాల పోటీలు నిర్వహిస్తాం.. స్పష్టం చేసిన ఇజ్రాయెల్‌ ప్రభుత్వం..

ప్రపంచాన్ని భయపెడుతోన్న కరోనా కొత్త వేరియంట్‌ 'ఓమిక్రాన్‌' కారణంగా తమ దేశంలో ఆంక్షలు విధించినప్పటీకి 'మిస్‌ యూనివర్స్‌-2021' పోటీలు జరిపి..

Omicron Variant: ఆంక్షలున్నప్పటికీ అందాల పోటీలు నిర్వహిస్తాం.. స్పష్టం చేసిన ఇజ్రాయెల్‌ ప్రభుత్వం..
Basha Shek
|

Updated on: Nov 28, 2021 | 9:07 PM

Share

ప్రపంచాన్ని భయపెడుతోన్న కరోనా కొత్త వేరియంట్‌ ‘ఓమిక్రాన్‌’ కారణంగా తమ దేశంలో ఆంక్షలు విధించినప్పటీకి ‘మిస్‌ యూనివర్స్‌-2021’ పోటీలు జరిపి తీరుతామని ఇజ్రాయెల్‌ పర్యాటక శాఖ తెలిపింది. షెడ్యూల్‌ ప్రకారం డిసెంబర్‌ 12న ఐలాట్‌లోని రెడ్ సీ రిసార్ట్‌లో నిర్వహించనున్నట్లు ఆ దేశ పర్యాటక మంత్రి యోయెల్‌ రజ్వోజోవ్‌ ఆదివారం వెల్లడించారు. ఈ అందాల పోటీలో పాల్గొనే అందరికీ ప్రతి 48 గంటలకు పీసీఆర్‌ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని, అలాగే వైరస్‌కు సంబంధించి ఇతర భద్రతా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలియజేశారు. దాదాపుగా 174 దేశాల్లో ఈ అంతర్జాతీయ ఈవెంట్‌ ప్రసారం అవుతుందని, అర్ధాంతరంగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేయలేమని ఆయన పేర్కొన్నారు.

కాగా మలావి నుంచి వచ్చిన ఓ మహిళా టూరిస్ట్‌కు ఓమిక్రాన్ వైరస్‌ సోకిందని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ధ్రువీకరించింది. దీంతో శనివారం నుంచే విదేశీయులను దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించింది. అర్ధరాత్రి కాబినెట్‌ సమావేశం ఏర్పాటుచేసి మరీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇజ్రాయెల్‌ దేశంలో ఆదివారం నుంచి మొత్తం14 రోజుల పాటు ఈ ఆంక్షలు కొనసాగుతాయని, ఫోన్- ట్రాకింగ్ ద్వారా క్వారంటైన్‌లో ఉ‍న్న వ్యక్తులను గుర్తిస్తామని ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. అదేవిధంగా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ఇజ్రాయెల్‌ దేశస్తులు కూడా క్వారంటైన్‌లో ఉండాలని, ఇంతకుముందు మూసివేసిన క్వారంటైన్ హోటళ్లన్నీ తిరిగి తెరవాలని ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి నఫ్తాలి బెన్నెట్‌ తెలిపారు.

Also Read:

Omicron Variant: డెల్టా వేరియంట్‌తో పోల్చుకుంటే ఓమిక్రాన్‌తో ప్రమాదం తక్కువే: ఆఫ్రికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌

Omicron: వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్.. తాజాగా ఆస్ట్రేలియాలో రెండు కేసులు గుర్తింపు.. 260 మంది ప్రయాణికులు ఐసోలేట్‌

Omicron Variant: కొత్త వేరియంట్‌పై కేంద్రం అలర్ట్.. అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు.. సిద్ధంగా ఉండాలని లేఖ!

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!