AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron: వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్.. తాజాగా ఆస్ట్రేలియాలో రెండు కేసులు గుర్తింపు.. 260 మంది ప్రయాణికులు ఐసోలేట్‌

New Variant Omicron: రెండేళ్ల క్రితం చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్.. రోజుకో రూపాన్ని సంతరించుకుంటూ ప్రపంచ దేశాల్లో కలకలం రేపుతూనే ఉంది. తాజాగా కోవిడ్ 19 కొత్త వేరియంట్ ..

Omicron: వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్.. తాజాగా ఆస్ట్రేలియాలో రెండు కేసులు గుర్తింపు.. 260 మంది ప్రయాణికులు ఐసోలేట్‌
New Variant Omicron
Surya Kala
|

Updated on: Nov 28, 2021 | 5:19 PM

Share

New Variant Omicron: రెండేళ్ల క్రితం చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్.. రోజుకో రూపాన్ని సంతరించుకుంటూ ప్రపంచ దేశాల్లో కలకలం రేపుతూనే ఉంది. తాజాగా కోవిడ్ 19 కొత్త వేరియంట్  ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఈ కొత్త వేరియంట్ వివిధ దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతుంది. దక్షిణాఫ్రికా  తర్వాత  బోట్స్ వానా, బెల్జియం, హాంకాంగ్, ఇజ్రాయల్ , జర్మనీ దేశాల్లో అనంతరం బిటన్ దేశాల్లో బయటపడింది. అయితే ఇప్పుడు ఆ జాబితాలో ఆస్ట్రేలియాకూడా చేరింది. ఆస్ట్రేలియా ఒమిక్రాన్  కేసులను గుర్తించింది. ఇద్దరు వ్యక్తుల్లో ఒమిక్రాన్ గుర్తించినట్లు ఆస్ట్రేలియా అధికారులు ప్రకటించారు.  ఒమిక్రాన్  వెలుగులోకి వచ్చిన తర్వాత ఆస్ట్రేలియా ప్రయాణలపై ఆంక్షలు విధించడం ద్వారా తమను తాము రక్షించుకోవడానికి  ప్రయత్నించినప్పటికీ కొత్త వైరస్ వెలుగులోకి వచ్చిందని అధికారులు చెప్పారు.  సౌతాఫ్రికా నుంచి ఆస్ట్రేలియా కి వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఒమిక్రాన్ గుర్తించారు.

ఆస్ట్రేలియాలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం న్యూ సౌత్ వేల్స్ లో శనివారం సాయంత్రం దక్షిణ ఆఫ్రికా నుండి సిడ్నీకి  వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కరోనా ఒమిక్రోన్ వేరియంట్ సోకినట్లు పరీక్షల్లో వెల్లడైందని ఆరోగ్య అధికారులు చెప్పారు.  ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఎటువంటి లక్షణాలు లేవని అంతేకాదు కరోనా వ్యాక్సిన్ కూడా తీసుకున్నారని చెప్పారు.  ఇద్దరు ప్రయాణీకులకు స్పెషల్ గా చికిత్స నందిస్తున్నామని NSW హెల్త్ తెలిపింది. అంతేకాదు ఆస్ట్రేలియాలో.. అడుగు పెట్టిన దక్షిణాఫ్రికాకు చెందిన మరో 12 మంది ప్రయాణికులు కూడా 14 రోజుల హోటల్ క్వారంటైన్‌లో ఉండగా, దాదాపు 260 మంది ఇతర ప్రయాణికులను, విమాన సిబ్బందిని ఐసోలేట్‌కి అధికారులు పంపారు.

దక్షిణాఫ్రికాలో బీ 1.1.529 కరోనా వేరియంట్ ను గుర్తించారు. 32 మ్యుటేషన్లు ఉన్న ఈ వేరియంట్ కు ‘ఒమిక్రాన్’గా పేరు పెట్టారు. ఇది ప్రమాదకరమైన వేరియంట్ గా వైద్య నిపుణులు గుర్తిస్తున్నారు. ఈ వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందే లక్షణం కలిగి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. రోజు రోజుకీ వివిధ దేశాల్లో ఈ వేరియంట్ వెలుగు చూడటంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. ఈ వేరియంట్ ను గుర్తించిన దేశాలపై ఆంక్షలకు సిద్ధమవుతున్నాయి. దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించేందుకు యూరోపియన్ దేశాలతో పాటు జపాన్, సింగపూర్, ఇజ్రాయెల్ దేశాలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు మన దేశంలో విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లో పక్కాగా వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరు వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్ గా గుర్తించారు. అయితే అది ఒమిక్రాన్ అవునో కాదో తెలియాల్సి ఉందని అధికారులు చెప్పిన సంగతి తెలిసిందే.

Also Read:   దేశ రాజధాని ఢిల్లీ వేదికగా అరుదైన దృశ్యం.. ఒకచోట చేరి మాట్లాడుకున్న వైసిపి, టీడీపీ ఎంపీలు.

Follow Us
హైసెన్స్‌ ఏ10, ఏ10 అల్ట్రా ఫోన్‌ డిస్‌ప్లే గురించి తెలుసా
హైసెన్స్‌ ఏ10, ఏ10 అల్ట్రా ఫోన్‌ డిస్‌ప్లే గురించి తెలుసా
పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్
పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్
కేవలం సినిమా స్నాక్ మాత్రమే కాదు.. పాప్‌కార్న్‌తో ఈ లాభాలు తెల్సా
కేవలం సినిమా స్నాక్ మాత్రమే కాదు.. పాప్‌కార్న్‌తో ఈ లాభాలు తెల్సా
ఎలుక తోక ఎందుకు పొడవు ఉంటుంది? దీంతో ఏమైనా ఉపయోగం ఉంటుందా?
ఎలుక తోక ఎందుకు పొడవు ఉంటుంది? దీంతో ఏమైనా ఉపయోగం ఉంటుందా?
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు
ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్
రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్ల పునుగులు.. ఇంట్లోనే ఇలా చేసి చూడండి
రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్ల పునుగులు.. ఇంట్లోనే ఇలా చేసి చూడండి
ఆవుతో స్నేహం చేస్తే ఇట్టా ఉంటుందా.. మాంసం మానేసిన కుక్క..
ఆవుతో స్నేహం చేస్తే ఇట్టా ఉంటుందా.. మాంసం మానేసిన కుక్క..