AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bangladesh: ఇస్కాన్ టెంపుల్‌పై 200 మంది దాడి.. విగ్రహాలను అపవిత్రం చేసి డబ్బు, నగలు దోచుకెళ్లిన మూక

Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మరోసారి హిందూ ఆలయం(Hindu Temples) లక్ష్యంగా  దాడి జరిగింది. ఈసారి ఏకంగా దేశ రాజధాని ఢాకాలోని ఇస్కాన్ మందిరం((ISKCON temple)పైనే దుండగులు దాడి..

Bangladesh: ఇస్కాన్ టెంపుల్‌పై 200 మంది దాడి.. విగ్రహాలను అపవిత్రం చేసి డబ్బు, నగలు దోచుకెళ్లిన మూక
Iskcon Temple Desecrated By
Surya Kala
|

Updated on: Mar 18, 2022 | 3:17 PM

Share

Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మరోసారి హిందూ ఆలయం(Hindu Temples) లక్ష్యంగా  దాడి జరిగింది. ఈసారి ఏకంగా దేశ రాజధాని ఢాకాలోని ఇస్కాన్ మందిరం((ISKCON temple)పైనే దుండగులు దాడి చేశారు. భారీ విధ్వసం సృష్టించారు. సుమారు 200 మంది తో కూడిన కొంతమంది ఇస్కాన్ టెంపుల్‌పై గురువారం దాడి చేశారు. ఆలయాన్ని ధ్వసం చేసి.. దోపిడీకి తెగబడ్డారు. ఈ ఘటనలో అనేక మంది హిందువులు గాయపడ్డారు.

ఢాకాలో వారిలోని 222 లాల్ మోహన్ సాహా వీధిలో ఇస్కాన్ రాధాకంట ఆలయం ఉంది. ఈ ఇస్కాన్ ఆలయంపైనే గురువారం కొందరు గుంపుగా ఏర్పడి దాడి చేశారు. ఈ దాడిలో సుమంత్ర చంద్ర శ్రవణ్, నిహర్ హల్దర్, రాజీవ్ భద్ర సహా పలువురుకి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. 62 ఏళ్ల హాజీ షఫీఉల్లాహ్ సారథ్యంలో ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. అతని ఆధ్వర్యంలో 150-200 మందితో కూడిన ఇస్లామిక్ మూక ఇస్కాన్ దేవాలయాన్ని ముట్టడించింది. వారు మూర్తిలను (విగ్రహాన్ని) అపవిత్రం చేశారు. ఆలయ ప్రాంగణాన్ని ధ్వంసం చేశారు, డబ్బు , ఇతర విలువైన వస్తువులను దోచుకున్నారు.

Also Read:

Stelth Omicron: స్టెల్త్ ఒమిక్రాన్ ద్వారా దేశంలో నాలుగో వేవ్.. ఆందోళనలో నిపుణులు

Anantapuram: వేడెక్కిన అనంత రాజకీయాలు.. వైసీపీ లీడర్స్ పై పరిటాల శ్రీరామ్ ఫైర్

Tirumala: తిరుమలలో అన్నమయ్య ప్రాజెక్టుకు పూర్వ వైభవాన్ని తీసుకుని రావాలని అన్నమయ్య వంశీకుల విజ్ఞప్తి