AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anantapuram: వేడెక్కిన అనంత రాజకీయాలు.. వైసీపీ లీడర్స్ పై పరిటాల శ్రీరామ్ ఫైర్

అనంతపురంలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వైసీపీ (YCP) నేతల తీరుపై టీడీపీ లీడర్ పరిటాల శ్రీరామ్ (Paritala Sriram) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసు కేసులు పెడతాం.. ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తాం అంటే....

Anantapuram: వేడెక్కిన అనంత రాజకీయాలు.. వైసీపీ లీడర్స్ పై పరిటాల శ్రీరామ్ ఫైర్
Paritala Sreeram
Ganesh Mudavath
|

Updated on: Mar 18, 2022 | 2:44 PM

Share

అనంతపురంలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వైసీపీ (YCP) నేతల తీరుపై టీడీపీ లీడర్ పరిటాల శ్రీరామ్ (Paritala Sriram) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసు కేసులు పెడతాం.. ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తాం అంటే ఊరుకునేది లేదని పరిటాల శ్రీరామ్ హెచ్చరించారు. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఇంట్లో ఉండి కొందరు వైసీపీ నాయకులు టీడీపీ(TDP) నేతల పై కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. వారు చెప్పినట్టు పోలీసులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. సామాజిక మాధ్యమాల్లో ఎమ్మెల్యేను కించపరిచినట్లు ప్రచారం చేశారన్న అనుమానంతో మండల ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ముత్యాలప్పను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించడంపై శ్రీరామ్ ఫైర్ అయ్యారు. తప్పు చేయకున్నా అరెస్టు చేస్తే ప్రైవేటు కేసు పెట్టాల్సి వస్తుందని పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. దళితులపై దాడులు, దౌర్జన్యాలు, భూకబ్జాలు ఎక్కువగా జరుగుతున్నా.. పోలీసులు స్పందించడం లేదన్నారు. ఎవరైతే టీడీపీకి మద్దతుగా ఉంటారో వారిపై దాడులకు పాల్పడుతున్నారన్నారు.

ఎవరైనా ఒక వ్యక్తిని అరెస్టు చేయాలంటే నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని.. కానీ అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోవాలని, లేకపోతే తాము కూడా న్యాయ పోరాటం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. టీడీపీ నాయకులపై పోలీసులు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే హైకోర్టుకు వెళ్తామన్నారు. కొందరు వైసీపీ నాయకుల తీరు వలన సొంత పార్టీ నేతలు కూడా ఇబ్బంది పడుతున్నారని అలాంటి వారికి కూడా తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు.

Also Read

Prabhas: మారుతి సినిమాకు ప్రభాస్‌ అన్ని కోట్లు తీసుకుంటున్నారా.? రోజుకు ఏకంగా కోటి రూపాయల పైమాటే..

IPL 2022: స్పాట్ ఫిక్సింగ్ నుంచి షారుఖ్ ఖాన్ నిషేధం వరకు.. ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద వివాదాలు ఇవే..

Viral Video: ద్యావుడా.. ఈ చిరుత చాలా స్మార్ట్ గురూ.. ఏకంగా మహిళతో ముచ్చట పెడుతూ..