Prabhas: మారుతి సినిమాకు ప్రభాస్‌ అన్ని కోట్లు తీసుకుంటున్నారా.? రోజుకు ఏకంగా కోటి రూపాయల పైమాటే..

Prabhas: బాహుబలి (Bahubali) తర్వాత ప్రభాస్‌ రేంజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ సినిమాతో ఒక్కసారిగా పాన్‌ ఇండియా హీరోగా మారారు. అప్పటి వరకు సౌత్‌ ఇండియాకు మాత్రమే పరిమితమైన ప్రభాస్‌ క్రేజ్‌ బాహుబలితో నార్త్‌ ఇండియాలోనూ వ్యాపించింది. దీంతో ప్రభాస్‌ నటించే...

Prabhas: మారుతి సినిమాకు ప్రభాస్‌ అన్ని కోట్లు తీసుకుంటున్నారా.? రోజుకు ఏకంగా కోటి రూపాయల పైమాటే..
Prabhas Movie
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 18, 2022 | 2:29 PM

Prabhas: బాహుబలి (Bahubali) తర్వాత ప్రభాస్‌ రేంజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ సినిమాతో ఒక్కసారిగా పాన్‌ ఇండియా హీరోగా మారారు. అప్పటి వరకు సౌత్‌ ఇండియాకు మాత్రమే పరిమితమైన ప్రభాస్‌ క్రేజ్‌ బాహుబలితో నార్త్‌ ఇండియాలోనూ వ్యాపించింది. దీంతో ప్రభాస్‌ నటించే ప్రతీ సినిమా దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. దీంతో సహజంగానే ప్రభాస్‌ రెమ్యునరేషన్‌ కూడా భారీగా పెరిగిపోయింది. ప్రస్తుతం ప్రభాస్‌ ఒక్కో సినిమాకు రూ. 100 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్‌ కొత్త సినిమా రెమ్యునరేషన్‌కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది.

ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను హార్రర్ కామెడీగా తెరకెక్కించనున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రభాస్‌ ఈ సినిమా కోసం కేవలం 60 రోజుల కాల్షీట్లు ఇచ్చారని, దీనికి గాను ఏకంగా రూ. 75 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే ప్రభాస్‌ రోజుకు ఏకంగా రూ. 1.25 కోట్ల వరకు తీసుకోనున్నారన్నమాట.

ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ పనుల్లో ఉన్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారటి టాక్‌. వీరిలో ఉప్పెన ఫేమ్‌ కృతీ శెట్టి కూడా ఒకరని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రాజెక్ట్‌ కే, ఆదిపురుష్‌, సలార్‌ చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్‌ ఆ సినిమాలను పూర్తి చేసి మారుతి సినిమాను మొదలు పెట్టనున్నారని తెలుస్తోంది.

Also Read: Credit Card: విదేశీ ప్రయాణాలకు క్రెడిట్ కార్డు.. కార్డు ఎంపికలో ఈ విషయాలు గమనించాల్సిందే..

India Coronavirus Updates: దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు

Holi 2022: హోలీ ఆడేముందు ఈ  పనులు చేయండి.. చర్మం.. కళ్లపై పడకుండా  ఈ టిప్స్ ఫాలో అవ్వండి..