Bheemla Nayak Aha: ఆహాలో పవర్ స్ట్రోమ్.. స్ట్రీమింగ్‏కు సిద్ధమైన బ్లాక్ బస్టర్ భీమ్లా నాయక్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో డైరెక్టర్ సాగర్ కె. చంద్ర తెరకెక్కించిన మూవీ భీమ్లా నాయక్ (Bheemla  Nayak)..

Bheemla Nayak Aha: ఆహాలో పవర్ స్ట్రోమ్.. స్ట్రీమింగ్‏కు సిద్ధమైన బ్లాక్ బస్టర్ భీమ్లా నాయక్..
Bheemla Nayak
Rajitha Chanti

|

Mar 18, 2022 | 2:03 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో డైరెక్టర్ సాగర్ కె. చంద్ర తెరకెక్కించిన మూవీ భీమ్లా నాయక్ (Bheemla  Nayak).. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో పవర్ స్టార్ సరసన నిత్యా మీనన్, రానాకు జోడిగా సంయుక్తా మీనన్ నటించారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ మూవీ వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డ్స్ క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో భీమ్లా నాయక్ రికార్డ్స్ తిరగరాసింది. మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‏గా వచ్చిన ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫాం ఆహాలో సందడి చేయనుంది. 100 % తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’ ప్రతి శుక్రవారం ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలను తెలుగు ప్రేక్ష‌కుకు అందిస్తోన్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా ‘ఆహా’ ప్రీమియర్‌గా మార్చి 25న‌ ‘భీమ్లా నాయక్’ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాదిలో తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి తొలి బిగ్గెస్ట్ హిట్ మూవీ ‘భీమ్లా నాయక్’. ఈ సినిమా ప్రీమియ‌ర్‌కు సంబంధించిన వివ‌రాల‌ను తెలియ‌జేస్తూ శుక్ర‌వారం ఆహా ఓ మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ‘భీమ్లా నాయక్’ సినిమా అహం.. ఆత్మ గౌర‌వానికి మ‌ధ్య జ‌రిగిన యుద్ధం. ఇన్‌స్పెక్టర్‌ భీమ్లా నాయ‌క్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. రిటైర్డ్ మిల‌ట‌రీ ఆఫీస‌ర్ డానియ‌ల్ శేఖ‌ర్‌గా రానా ద‌గ్గుబాటి మ‌ధ్య సాగే పోరే ఈ చిత్రం. వీరిద్ద‌రితో పాటు సినిమాలో బ‌ల‌మైన మ‌హిళా పాత్ర‌లు క‌నిపిస్తాయి. ఇందులో భీమ్లా నాయ‌క్ భార్య‌గా నిత్యామీన‌న్‌.. డానియ‌ల్ శేఖ‌ర్ భార్య‌గా సంయుక్తా మీన‌న్ న‌టించారు. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ త‌మ‌న్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు.

‘భీమ్లా నాయక్’ మూవీ రిలీజ్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ‘లాలా భీమ్లా..’జింగల్‌ను కూడా ఆహా విడుద‌ల చేసింది. ఈ సినిమా టైటిల్ ట్రాక్ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది. దీన్ని మోష‌న్ పోస్ట‌ర్‌తో క‌లిపి ఆహాలాభీమ్లా ఫ్ర‌మ్ మార్చి 25న అని ఆహా ప్ర‌క‌టించింది. అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ కోసం స్పెష‌ల్ ట్రైల‌ర్‌ను కూడా ఆహా విడుద‌ల చేసింది. 2021లో తెలుగు సినిమా బిగ్గెస్ట్ హిట్ మూవీస్‌, వెబ్ ఒరిజిన‌ల్స్‌ను ఆహా ఆడియెన్స్‌కు అందిస్తోంది. క్రాక్‌, 11 అవ‌ర్‌, జాంబిరెడ్డి, ల‌వ్ స్టోరి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌, డీజే టిల్లు, చావు కబురు చ‌ల్ల‌గా, నాంది, అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే, తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్‌, 3 రోజెస్‌, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్‌, భామా క‌లాపం, కాలా, ఆహా భోజ‌నంబు, వ‌న్‌, సూప‌ర్ డీల‌క్స్, చ‌తుర్ ముఖం, త‌ర‌గ‌తి గ‌ది దాటి, ది బేక‌ర్ అండ్ ది బ్యూటీ, మ‌హా గ‌ణేశా, స‌ర్కార్‌, ప‌రిణ‌యం, ఒరేయ్ బామ్మ‌ర్ది, కోల్డ్ కేస్‌, అల్లుడు గారు, ఇచ్చట వాహ‌న‌ములు నిలుప‌రాదు సినిమాలను అందిస్తోంది ఆహా.

Also  Read: Vidya Balan: ఆ నిర్మాత నాతో దారుణంగా ప్రవర్తించాడు.. నన్ను అసహ్యంగా చూసేవారు.. బాలీవుడ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్..

Aishwarya Danush: భార్యభర్తలుగా విడిపోయారు.. స్నేహితులుగా మారిపోయారు.. ధనుష్.. ఐశ్వర్య ట్వీట్స్ వైరల్..

Holi 2022: హోలీ రంగుల నుంచి కళ్లను కాపాడుకోవాలనుకుంటే.. ఈ 4 చిట్కాలను అనుసరించండి..

Chia Seeds Benefits: చియా విత్తనాలతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఈ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు….

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu