AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vidya Balan: ఆ నిర్మాత నాతో దారుణంగా ప్రవర్తించాడు.. నన్ను అసహ్యంగా చూసేవారు.. బాలీవుడ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్..

డర్టీ పిక్చర్.. కహానీ వంటి సినిమాలతో బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది విద్యాబాలన్ (Vidya Balan).

Vidya Balan: ఆ నిర్మాత నాతో దారుణంగా ప్రవర్తించాడు.. నన్ను అసహ్యంగా చూసేవారు.. బాలీవుడ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్..
Vidya Balan
Rajitha Chanti
|

Updated on: Mar 18, 2022 | 9:19 AM

Share

డర్టీ పిక్చర్.. కహానీ వంటి సినిమాలతో బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది విద్యాబాలన్ (Vidya Balan). నటన పరంగా సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుంత బాలీవుడ్ ఇండస్ట్రీలోని అగ్రకథానాయికలలో ఒకరిగా విద్యాబాలన్.. తన కెరీర్ అరంభంలో మాత్రం చాలా కష్టాలు పడిందట.. ఇండస్ట్రీలో కొందరు తనపట్ల దారుణంగా ప్రవర్తించారని.. దాంతో తనకు ఇండస్ట్రీ అంటేనే అసహ్యం వచ్చేలా చేశారంటూ చెప్పుకొచ్చింది విద్యాబాలన్. ఆమె నటించిన లేటేస్ట్ చిత్రం జల్సా. అమెజాన్ ప్రైమ్‏లో కానుంది. ఆ మూవీ ప్రమోషన్స్‏లో భాగంగా.. విద్యాబాలన్ తన కెరీర్‏లో పరిస్థితుల గురించి చెప్పుకొచ్చింది.

విద్యాబాలన్ మొదటి సినిమా తుమ్హారీ సులు మూవీ తర్వాత దాదాపు పదముడూ సినిమాల్లో నుంచి ఆమెను తీసివేశారని తెలిపింది. అప్పట్లో తనను సినిమాల నుంచి తీసివేసిన నిర్మాతలే ఇప్పుడు కాల్ చేసి సినిమాలు చేయమని అడుగుతున్నారని.. కానీ.. అలాంటి వారి ఆఫర్స్ తాను రిజెక్ట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది.. అంతేకాకుండా.. అప్పట్లో ఓ నిర్మాత తనపట్ల దారుణంగా ప్రవర్తించాడని వివరించింది. అంతేకాకుండా.. ఓ నిర్మాత నా పట్ల దారుణంగా ప్రవర్తించాడు.. నన్ను అసహ్యంగా చూసేవాడు.. అతని ప్రవర్తన వలన నన్ను నేను ఆరు నెలల పాటు అద్దంలో చూసుకునేందుకు ధైర్యం చేయలేకపోయాను. 2003లో జరిగింది ఈ సంఘటన.. ఆ సమయంలో ఏ సినిమా చేయాలనుకున్న కుదరలేదని చెప్పింది.

ఇక అదే సమయంలో కె. బాలచందర్ చేయాల్సిన రెండు పెద్ద సినిమాలకు సంతకం చేశానని.. కానీ ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే తనను తీసివేయడం బాధ కలిగించిందని… ఆ బాధతో మెరైన్ డ్రైవ్ నుంచి బాంద్రా వరకు నడుస్తూ వెళ్లానని చెప్పింది.. నేను గంటల తరబడి నడిచాను.. చాలా ఏడ్చాను.. ఆ చేదు జ్ఞాపకాలు ఇప్పుడు నాకు సరిగ్గా గుర్తులేవు.. కానీ ఆ మూడు సంవత్సరాలు మాత్రం ఏ పని చేసిన పనికిరాకుండా మారింది. అంటూ చెప్పుకొచ్చింది.

Also Read: Andhra: ఏపీలో ‘RRR’ సినిమా టికెట్స్ రేట్స్ ఏయే ప్రాంతాల్లో ఎలా ఉండనున్నాయ్ అంటే..?

HanuMan: శరవేగంగా హను-మాన్ మూవీ షూటింగ్.. సూపర్ హీరోగా కనిపించనున్న తేజ

RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీకి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. రేటు పెంచుకోవడానికి అనుమతిస్తూ జీవో

Nazriya Nazim : అంటే సుందరానికి మూవీ నుంచి నాని ప్రేయసి లుక్ వచ్చేసింది.. ఎంత క్యూట్‌గా ఉందో..