AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bheemla Nayak: డబుల్ బొనాంజా ఇవ్వనున్న భీమ్లా నాయక్.. ఓటీటీలలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. రానా దగ్గుబాటి కలిసి నటించిన లేటేస్ట్ చిత్రం భీమ్లా నాయక్ (Bheemla Nayak).

Bheemla Nayak: డబుల్ బొనాంజా ఇవ్వనున్న భీమ్లా నాయక్.. ఓటీటీలలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Bheemla Nayak
Rajitha Chanti
|

Updated on: Mar 18, 2022 | 11:34 AM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. రానా దగ్గుబాటి కలిసి నటించిన లేటేస్ట్ చిత్రం భీమ్లా నాయక్ (Bheemla Nayak). ఫిబ్రవరి 25న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పవన్ అభిమానులకు ఫుల్ మీల్స్ ఇచ్చేశారు మేకర్స్. త్రివిక్రమ్ పవర్ ఫుల్ డైలాగ్స్.. పవర్ స్టార్ యాక్షన్ సీన్లకు రికార్డులు బద్దలయ్యాయి.. విడుదలైన మూడు రోజుల్లోనే వంద కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. ఇప్పుడు భీమ్లా నాయక్ ఓటీటీలో సందడి చేయనుంది. ఈసారి డిజిటల్ ప్రేక్షకులకు డబుల్ బొనాంజా ఇవ్వనున్నారు భీమ్లా నాయక్ మేకర్స్. ఒకటి కాదు.. రెండు ఓటీటీ ప్లాట్ ఫాంలలో ఒకేరోజున స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారింగా ప్రకటించారు.

మలయాళం సూపర్ హిట్ అయ్యప్పనుమ్ కోషియం తెలుగు రీమేక్‏గా తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. ఇప్పుడు ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‏తోపాటు.. ఆహాలో మార్చి 25న స్ట్రీమింగ్ కానుంది. విడుదలైన నాలుగు వారాల్లోనే ఓటీటీలో సందడి చేయనున్నాడు భీమ్లా నాయక్. ఇక అదే రోజున ప్రపంచవ్యాప్తంగా జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ సైతం థియేటర్లలో భారీ ఎత్తున రిలీజ్ కానుంది. డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ మూవీలో పవన్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్ గా నటించగా.. రానాకు జోడీగా సంయుక్త మీనన్ నటించింది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి నిర్మించారు.

Also  Read: Vidya Balan: ఆ నిర్మాత నాతో దారుణంగా ప్రవర్తించాడు.. నన్ను అసహ్యంగా చూసేవారు.. బాలీవుడ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్..

Aishwarya Danush: భార్యభర్తలుగా విడిపోయారు.. స్నేహితులుగా మారిపోయారు.. ధనుష్.. ఐశ్వర్య ట్వీట్స్ వైరల్..

Holi 2022: హోలీ రంగుల నుంచి కళ్లను కాపాడుకోవాలనుకుంటే.. ఈ 4 చిట్కాలను అనుసరించండి..

Chia Seeds Benefits: చియా విత్తనాలతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఈ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు….