Sushanth: డిజిటల్ ఎంట్రీకి రెడీ అయిన అక్కినేని కుర్రహీరో.. వెబ్ సిరీస్‌లోకి అడుగుపెడుతున్న సుశాంత్

అక్కినేని యంగ్ హీరోల్లో ఒకడైన సుశాంత్ కాళిదాసు చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయిన విషయం తెలిసిందే.  కెరీర్ మొదలుపెట్టిన తక్కువ సమయం లోనే కరెంట్, అడ్డా, అటాడు కుందాం..రా , చి౹౹ల౹౹సౌ౹౹

Sushanth: డిజిటల్ ఎంట్రీకి రెడీ అయిన అక్కినేని కుర్రహీరో.. వెబ్ సిరీస్‌లోకి అడుగుపెడుతున్న సుశాంత్
Sushanth Akkineni
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 19, 2022 | 8:42 AM

Sushanth: అక్కినేని యంగ్ హీరోల్లో ఒకడైన సుశాంత్ కాళిదాసు చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయిన విషయం తెలిసిందే.  కెరీర్ మొదలుపెట్టిన తక్కువ సమయం లోనే కరెంట్, అడ్డా, అటాడు కుందాం..రా , చి౹౹ల౹౹సౌ౹౹ వంటి  హిట్ సినిమాలలో నటించి మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో. ఓ వైపు సినిమాలు చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ సినిమాలు చేశాడు సుశాంత్. “అల వైకుంఠ పురములో”.. సినిమాతో మంచి క్లాస్ క్యారెక్టర్ లో నటించి అక్కినేని అభిమానులతో పాటు క్లాస్, మాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాడు. కరోనా టైంలో ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’సినిమా ద్వారా మంచి విజయం సాధించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.

తాజాగా డిజిటల్ ఎంట్రీకి రెడీ అయ్యాడు సుశాంత్.  ప్రస్తుతం వెబ్ సిరీస్ ట్రెండ్ నడుస్తుండడంతో ఆసక్తి కరమైన కథలో నటించనున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ వెబ్ సిరీస్ ను కొల్లా ఏంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రవీణ్ కొల్లా నిర్మిస్తున్నారు. లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ లో సుశాంత్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు ప్రేక్షకులు సుశాంత్ ను పోలీస్ గెటప్ లో చూడలేదు. పోలీస్ జీప్ ముందు మఫ్టీ లో కూల్ గా నిల్చొని చూస్తున్న ఫోటోను చూస్తుంటే ఈ వెబ్ సిరీస్ థ్రిల్లర్ నేపథ్యంలో ఉండనుందని అర్ధమవుతుంది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయనున్నారు. ఇక మాస్ రాజా రవి తేజ నటిస్తున్న రావణాసుర సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు సుశాంత్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Photo: డెలివరీ బాయ్‌గా మారిన హాస్యనటుడు.. వైరల్‌ అవుతున్న ఫొటో..!

Krithi Shetty: కలర్ ఫుల్ డ్రెస్సులో కవ్విస్తున్న కృతి లేటెస్ట్ ఫోటోస్ వైరల్

Krithi Shetty : కోలీవుడ్‌కు కృతి శెట్టి.. సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న బేబమ్మ..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!