Nikhil Siddhartha: కుర్ర హీరో థ్రిల్లింగ్ మిస్టరీ.. భారీ ధరకు ‘కార్తికేయ2’ నాన్ థియేట్రికల్ రైట్స్

యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హ్యాపీ డేస్ తర్వాత సోలో హీరోగా మారిన నిఖిల్ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు.

Nikhil Siddhartha: కుర్ర హీరో థ్రిల్లింగ్ మిస్టరీ.. భారీ ధరకు 'కార్తికేయ2' నాన్ థియేట్రికల్ రైట్స్
Karthikeya 2
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 19, 2022 | 7:48 AM

Nikhil Siddhartha: యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హ్యాపీ డేస్ తర్వాత సోలో హీరోగా మారిన నిఖిల్ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. మొదటి నుంచి విభిన్నమైన కథలను ఏంచేసుకుంటూ ఆచి తూచి కెరీర్ ను సాగిస్తున్నాడు నిఖిల్. ఈ కుర్ర హీరో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టి ఆయా షూటింగ్స్ పనిలో బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పటికే నిఖిల్ 18 పేజెస్, కార్తికేయ 2 సినిమాల షూటింగ్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల్లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుంది. సుకుమార్ రైటింగ్స్ పై తెరకెక్కుతున్న 18 పేజెస్ సినిమాలో నిఖిల్ విభిన్నమైన పాత్రలో నటించనున్నాడట. అలాగే చెందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 అనే సినిమా చేస్తున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో కార్తికేయ సినిమా వచ్చింది. డిఫరెంట్ కనెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి అదే తరహా కథతో చందు మొండేటి సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నాడు.

నిఖిల్ కెరీర్ లో కార్తికేయ సినిమా మంచి విజయాన్ని అందుకొని అతడికి  సినీ జర్నీలో మైల్ స్టోన్ గా నిలిచింది.  ఎనిమిదేళ్ల క్రితం తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు. నిఖిల్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మించబడుతున్న మూవీ ‘కార్తికేయ 2. థ్రిల్లింగ్ మిస్టరీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ – అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై టీజీ విశ్వప్రసాద్ – అభిషేక్ అగర్వాల్ – వివేక్ కూచిభోట్ల సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నారని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Photo: డెలివరీ బాయ్‌గా మారిన హాస్యనటుడు.. వైరల్‌ అవుతున్న ఫొటో..!

Krithi Shetty: కలర్ ఫుల్ డ్రెస్సులో కవ్విస్తున్న కృతి లేటెస్ట్ ఫోటోస్ వైరల్

Krithi Shetty : కోలీవుడ్‌కు కృతి శెట్టి.. సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న బేబమ్మ..

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..