AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krithi Shetty : కోలీవుడ్‌కు కృతి శెట్టి.. సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న బేబమ్మ..

తొలి సినిమాతోనే  కుర్రాళ్ళ గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసి.. అదే స్పీడ్‌తో దూసుకుపోతోంది బేబమ్మ. ఇప్పుడు మరో స్టెప్ పైకెక్కి పాన్‌ సౌత్ హీరోయిన్ అనే ట్యాగ్‌ని సొంతం చేసుకునే స్కెచ్ గీసుకుందట.

Krithi Shetty : కోలీవుడ్‌కు కృతి శెట్టి.. సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న బేబమ్మ..
Krithi Shetty
Rajeev Rayala
|

Updated on: Mar 18, 2022 | 8:19 PM

Share

Krithi Shetty : తొలి సినిమాతోనే  కుర్రాళ్ళ గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసి.. అదే స్పీడ్‌తో దూసుకుపోతోంది బేబమ్మ. ఇప్పుడు మరో స్టెప్ పైకెక్కి పాన్‌ సౌత్ హీరోయిన్ అనే ట్యాగ్‌ని సొంతం చేసుకునే స్కెచ్ గీసుకుందట. టాలీవుడ్‌లో ఎలాగూ మంచి బేస్ పడింది గనుక.. ఇప్పుడు కోలీవుడ్ వైపు సీరియస్‌గా చూస్తోంది కృతిశెట్టి. స్లో అండ్ స్టడీగా గ్రాఫ్‌ని చక్కదిద్దుకుంటూ సైలెంట్‌గా చెన్నై రైలెక్కబోతున్నారట. చందనసీమ నుంచి టాలీవుడ్‌ గ్లామర్ స్పేస్‌లోకి ఉప్పెనలా దూసుకొచ్చిన కన్నడ భామ కృతిశెట్టి… తన కెరీర్‌ని చాలా చక్కగా డిజైన్ చేసుకుంటున్నారు. శ్యామ్‌సింగరాయ్‌ తర్వాత గోల్డెన్‌ లెగ్ అనే క్రెడిట్‌ని సుస్థిరం చేసుకున్న ఈ బంగార్రాజు మినీ బ్యూటీ.. నెక్ట్స్‌ స్టాప్ చెన్నై అంటున్నారు. కోలీవుడ్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

తెలుగులో వరుస హిట్లు కొడుతున్న క్రితిశెట్టి పెర్ఫామెన్స్‌కి ఫిదా అయ్యారు తమిళ్ హీరో సూర్య. మరో ఆలోచనే లేకుండా తనకు జోడీగా నెక్ట్స్ మూవీలో ఆమెనే అప్రోచ్ అయ్యారట. తనకు నంద, శివపుత్రుడు లాంటి మెమరబుల్ హిట్స్‌ ఇచ్చిన బాల డైరెక్షన్‌లో ఈ మూవీ రాబోతోంది. ఫిమేల్ లీడ్స్‌ని డీగ్లామర్ షేడ్స్‌తో చూపిస్తూ ఒరిజినల్‌ టాలెంట్‌ని పోట్రే చేసే బాల… ఈసారి కృతిశెట్టిని టేకప్ చెయ్యబోతున్నారన్నది చెన్నై సర్కిల్స్‌లో వినిపిస్తున్న హాట్ న్యూస్. ఆల్రెడీ తెలుగులో ఇంద్రగంటి డైరెక్షన్‌లో సుధీర్‌బాబు హీరోగా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే యూనిక్‌ లవ్‌స్టోరీ చేస్తున్నారు కృతి. నితిన్‌ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’లో రూరల్‌ విమన్ పాత్రలో నటిస్తున్నారు. అటు… పందెంకోడి ఫేమ్ లింగుస్వామి కెప్టెన్సీలో రాబోయే మల్టిలింగువల్ ‘ది వారియర్’ మూవీలో ఇస్మార్ట్ హీరోకి జోడీగా చేస్తోంది కూడా ఈ అమ్మడే. ఇప్పుడు సూర్య హీరోగా బాలా సినిమా ఓకే అవుతోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kashmir Files: కశ్మీర్‌ ఫైల్స్‌ చిత్ర దర్శకుడికి భద్రత పెంపు.. వై క్యాటగిరీ కల్పిస్తూ అధికారుల నిర్ణయం..

Prabhas: మారుతి సినిమాకు ప్రభాస్‌ అన్ని కోట్లు తీసుకుంటున్నారా.? రోజుకు ఏకంగా కోటి రూపాయల పైమాటే..

Bheemla Nayak Aha: ఆహాలో పవర్ స్ట్రోమ్.. స్ట్రీమింగ్‏కు సిద్ధమైన బ్లాక్ బస్టర్ భీమ్లా నాయక్..

Follow Us
రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా?
రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా?
పాల ప్యాకెట్స్.. గ్రీన్, బ్లూ, ఆరెంజ్ రంగులో ఎందుకు ఉంటాయో తెలుసా
పాల ప్యాకెట్స్.. గ్రీన్, బ్లూ, ఆరెంజ్ రంగులో ఎందుకు ఉంటాయో తెలుసా
గుమ్మడి పువ్వులను తింటే ఎంత మంచిదో తెలుసా? అస్సలే ఊహించరు!
గుమ్మడి పువ్వులను తింటే ఎంత మంచిదో తెలుసా? అస్సలే ఊహించరు!
వేడి ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెడుతున్నారా? ఏమవుతుందో తెలిస్తే..
వేడి ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెడుతున్నారా? ఏమవుతుందో తెలిస్తే..
తల్లి అంత్యక్రియల తేదీపై AI చాట్ బాట్ తప్పుడు సలహా
తల్లి అంత్యక్రియల తేదీపై AI చాట్ బాట్ తప్పుడు సలహా
శుభలగ్నంలో మొగుడ్ని అమ్మేసే సీన్ చూసి ఆ పెద్ద హీరో ఏమన్నారంటే..
శుభలగ్నంలో మొగుడ్ని అమ్మేసే సీన్ చూసి ఆ పెద్ద హీరో ఏమన్నారంటే..
సొంత ఇల్లు లేక.. తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లలేని దుస్థితి
సొంత ఇల్లు లేక.. తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లలేని దుస్థితి
హార్దిక్ పాండ్యా రీఎంట్రీకి ఓ కండీషన్ పెట్టిన గంభీర్..
హార్దిక్ పాండ్యా రీఎంట్రీకి ఓ కండీషన్ పెట్టిన గంభీర్..
2030 నాటికి ప్రపంచం అంతం కాబోతుందా? AI చెప్పిన భవిష్యవాణి సంచలనం!
2030 నాటికి ప్రపంచం అంతం కాబోతుందా? AI చెప్పిన భవిష్యవాణి సంచలనం!
పాతబస్తీలో రూ.10 చిల్లర కోసం దారుణం.. ఆటో డ్రైవర్‌ హత్య..
పాతబస్తీలో రూ.10 చిల్లర కోసం దారుణం.. ఆటో డ్రైవర్‌ హత్య..