AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: డెలివరీ బాయ్‌గా మారిన హాస్యనటుడు.. వైరల్‌ అవుతున్న ఫొటో..!

Viral Photo: తన హాస్యంతో అందరిని కడుపుబ్బ నవ్వించే కపిల్ శర్మ కొత్త సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు . తాజాగా ఆయన వ్యాయామం చేస్తున్న ఒక ఫొటో సోషల్ మీడియాలో

Viral Photo:  డెలివరీ బాయ్‌గా మారిన హాస్యనటుడు.. వైరల్‌ అవుతున్న ఫొటో..!
Kapil Sharma
uppula Raju
| Edited By: Ram Naramaneni|

Updated on: Mar 19, 2022 | 6:54 PM

Share

Viral Photo: తన హాస్యంతో అందరిని కడుపుబ్బ నవ్వించే కపిల్ శర్మ కొత్త సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. తాజాగా ఆయన వ్యాయామం చేస్తున్న ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడు అతడి మరొక చిత్రం కూడా ట్రెండ్‌ అవుతోంది. ఇందులో తెల్లవారుజామున డెలివరీ బాయ్ గెటప్‌లో రోడ్డుపై బైక్ నడుపుతూ కనిపిస్తాడు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. కపిల్ శర్మ ప్రస్తుతం తన పేరులేని సినిమా షూటింగ్‌లో చాలా బిజీగా ఉన్నాడు. ఒక కంపెనీకి చెందిన పసుపు రంగు టీ-షర్టును ధరించి బైక్‌పై కూర్చొని, వెనకాల బ్లూ కలర్ బ్యాగ్ వేసుకున్న ఫొటో ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంది. సాధారణంగా ఫుడ్ డెలివరీ బాయ్‌లు ఇలాంటి బ్యాగ్‌లు వేసుకొని ఆహారాన్ని పంపిణీ చేస్తారు. అంతే కాకుండా ఎడమ చేతికి వాచీ పెట్టుకుని నల్లటి హెల్మెట్ ధరించి ఉన్నాడు. ఈ సినిమాలో కపిల్ డెలివరీ బాయ్‌గా పనిచేసి జీవనోపాధి పొందుతున్నట్లు తెలుస్తోంది. మీరు ఫొటోని సరిగ్గా గమనిస్తే ఎడమ వైపున కారులో ఉంచిన కెమెరా కూడా కనిపిస్తుంది. దాని డోర్ వెనుక నుంచి తెరిచే ఉంటుంది. కెమెరామెన్ అక్కడ నుంచి కెమెరాను ఆపరేట్ చేస్తుండటం మనం గమనించవచ్చు.

అయితే ఎవరో ఒకరు కపిల్ చిత్రాన్ని తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.  నెటిజన్లు ఈ ఫొటోపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఒక నెటిజన్‌ ‘సార్ నేను నిన్ను ఈరోజు ప్రత్యక్షంగా చూశాను’ అని క్యాప్షన్‌లో రాశాడు. దీనిపై కపిల్‌ శర్మ స్పందిస్తూ ‘ఎవరికీ చెప్పకు’ అన్నాడు. అలాగే ఇటీవల కపిల్ శర్మ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కలిసిన సంగతి తెలిసిందే. వీటికి సంబంధించిన చాలా ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సమావేశంలో ఆయనతో పాటు సినీ నిర్మాత, నటి నందితా దాస్ కూడా ఉన్నారు. కపిల్‌తో సీఎం చాలాసేపు ముచ్చటించారు.

RRR Pre-Release Event Live: 

IND vs AUS: ఆస్ట్రేలియాని ఓడించడం అంత సులువు కాదు.. ఎందుకంటే ఈ 5గురు ప్లేయర్లు చాలా డేంజర్..!

Clouds: మేఘాలు నలుపు రంగులో ఉంటాయి.. కానీ దీని వెనుక దాగున్న సీక్రెట్‌ ఏంటో తెలుసా..?

Andhra Pradesh: బందరులో తీవ్ర ఉద్రిక్తత.. పొలిటికల్ టర్న్ తీసుకున్న నాగలక్ష్మి ఆత్మహత్య..