SS Rajamouli: డార్లింగ్ గురించి సంచలన కామెంట్స్ చేసిన జక్కన్న.. షాక్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్
మరి కొద్దిరోజుల్లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా కోసం మెగా అభిమానులు నందమూరి ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా..
SS Rajamouli: మరి కొద్దిరోజుల్లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా కోసం మెగా అభిమానులు నందమూరి ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 25న ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు ఆర్ఆర్ఆర్ టీమ్. నేటి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో ప్రమోషన్స్ చేయనున్నారు చిత్రయూనిట్. అలాగే ఈ నెల 19న ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్ కర్ణాటకలో జరగనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సందర్భంలో ఎన్టీఆర్ రాజమౌళిని మన సినిమా ప్రీమియర్ కు ప్రభాస్ వస్తాడా అని అడగ్గా జక్కన సంచలన సమాధానం చెప్పి షాక్ ఇచ్చాడు.
తాజా మీడియా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ జక్కన్నను .. ప్రీమియర్ కు ప్రభాస్ వాళ్ళు వస్తారా..? అని ప్రశ్నించగా రాజమౌళి ప్రీమియరా..? ఏ ప్రీమియర్ .? అని అంటాడు. దానికి తారక్ మాకేదో పెద్ద స్పెషల్ గా ప్రీమియర్ వేసినట్టు ఇక్కడ.. అంటాడు.. దానికి ప్రభాసు కదిలి ప్రీమియర్ రావడం అది జరిగే పని కాదు.. తారక్ వెంటనే చరణ్ తీసుకొస్తాడు అనగానే చరణ్ అందుకొని నేను నీతో ఉంటా.. అంటాడు. మళ్లీ తారక్ మనం వెళ్లి తీసుకొద్దాం అయితే అనగానే చరణ్ వద్దు షో పోద్ది.. అంటాడు. రాజమౌళి కలుగజేసుకొని డార్లింగ్ వద్దు డార్లింగ్..! అని తారక్ కు సర్ది చెప్తాడు. మొత్తంగా ఈ సంభాషణ ప్రేక్షకులకు వినోదాన్ని అందించింది. ఈ ముగ్గురికి ప్రభాస్ అంటే ఎంత అభిమానమో ఈ సంభాషణను బట్టి అర్ధమవుతుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :