AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Noble Prize: ఉక్రెయిన్ అధ్యక్షుడికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి.. ఐరోపా నేతల ప్రతిపాదన

ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌ స్కీ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయాలని ఐరోపా నేతలు నిర్ణయించారు. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం (Russia - Ukraine War) సమయంలో శాంతి కోసం పోరాడుతున్న..

Noble Prize: ఉక్రెయిన్ అధ్యక్షుడికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి.. ఐరోపా నేతల ప్రతిపాదన
Jelen Sky 1
Ganesh Mudavath
|

Updated on: Mar 18, 2022 | 10:03 PM

Share

ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌ స్కీ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయాలని ఐరోపా నేతలు నిర్ణయించారు. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం (Russia – Ukraine War) సమయంలో శాంతి కోసం పోరాడుతున్న జెలెన్ స్కీని నామినేట్ చేయాలని ఐరోపా సమాఖ్యకు చెందిన నేతలు, మాజీ నాయకులు ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈ మేరకు నార్వేజియన్ నోబెల్ కమిటీకి మార్చి11న లేఖ రాశారు. అయితే 2022కు సంబంధించి నోబెల్(Noble) శాంతి బహుమతికి నామినేషన్స్ పంపే గడువు ముగిసినప్పటికీ.. జెలెన్‌స్కీకి నోబెల్ బహుమతి అందించేందుకు నామినేషన్ల గడువును ఈనెల 31 వరకు పొడిగించాలని కోరారు. రష్యా చేస్తున్న దాడులను అధ్యక్షుడు జెలెన్‌స్కీ నేతృత్వంలోని ఉక్రెయిన్ దీటుగా ఎదుర్కొంటోంది.

అయితే ఇటీవల ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ భావోద్వేగ వీడియోను పోస్ట్‌ చేశారు. దాడులకు ముందు ఉక్రెయిన్‌ ఎలా ఉందో.. ఇప్పుడు ఎంతటి భయానక పరిస్థితుల్లో చిక్కుకుందనేది ఆ వీడియో కళ్లకు కడుతోంది. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి సంబంధించి 92 సంస్థల నుంచి 251 నామినేషన్లు వచ్చాయి. ఈ ఏడాది అక్టోబర్ 3-10 మధ్య నోబెల్ బహుమతుల్ని ప్రకటిస్తారు.

Also Read

Holi 2022: హోలీన ఉదయం రంగులు.. సాయంత్రం పిడిగుద్దులు..ఇదెక్కడాచారమండి బాబోయ్

Krithi Shetty : కోలీవుడ్‌కు కృతి శెట్టి.. సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న బేబమ్మ..

High Temperature: వెదర్ అలర్ట్.. నిప్పుల కుంపటిలా నల్గొండ.. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు