AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

High Temperature: వెదర్ అలర్ట్.. నిప్పుల కుంపటిలా నల్గొండ.. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

తెలంగాణలో భానుడు భగభగమంటున్నాడు. మార్చి ప్రారంభంలోనే తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. స‌హ‌జంగా ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. కానీ ఈ ఏడాది మార్చి(March) నుంచే సూర్యుడు...

High Temperature: వెదర్ అలర్ట్.. నిప్పుల కుంపటిలా నల్గొండ.. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు
Nalgonda Temperature
Ganesh Mudavath
|

Updated on: Mar 18, 2022 | 5:03 PM

Share

తెలంగాణలో భానుడు భగభగమంటున్నాడు. మార్చి ప్రారంభంలోనే తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. స‌హ‌జంగా ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. కానీ ఈ ఏడాది మార్చి(March) నుంచే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. ఉద‌యం 8 గ‌ంట‌ల నుంచే ఎండ‌లు మండిపోతుండ‌డంతో జ‌నాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏప్రిల్ మొద‌టి వారం నుంచి ఎండ‌లు మ‌రింత తీవ్రం కానున్నాయ‌ని, అలాగే వ‌డ‌గాల్పుల ప్రభావం అధికంగా ఉండే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు దేశంలోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశంలో అత్యధికంగా తెలంగాణ‌ (Telangana) లో ఎక్కువగా ఎండలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా న‌ల్గొండ (Nalgonda) జిల్లాలో భానుడు భగ్గుమంటున్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. గురువారం న‌ల్గొండ జిల్లాలో అత్యధికంగా 43.5 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్రత న‌మోద‌య్యింద‌ని ఐఎండీ అధికారులు వెల్లడించారు. మ‌రో మూడు రోజుల పాటు ఇదే తీవ్రత కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ‌ పేర్కొంది. అలాగే 5 రోజుల పాటు వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇప్పటికే వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్న ప్రాంతాల వివరాలను వాతావరణ శాఖ వెల్లడించింది. గ‌తేడాది మార్చిలో 37.4 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్రత‌లు న‌మోదయ్యాయి. ఇదిలా ఉండగా, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. మార్చి 21 నాటికి తుపానుగా మారనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మార్చి 19 నాటికి తీవ్ర అల్పపీడనంగా, మారి 20 నాటికి వాయుగుండంగా మారుతుంది. ఆ తర్వాత 21వ తేదీకు తుఫానుగా మారి.. ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తూ.. మార్చి 23 నాటికి బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్ తీరానికి చేరనుందని వాతావరణ శాఖ తెలిపింది.

Also Read

F3 Movie: అభిమానులకు తమ స్టైల్‌లో హోలీ విషెస్‌ చెప్పిన ఎఫ్‌3 టీమ్‌.. వైరల్‌ అవుతోన్న ఫన్నీ వీడియో..

Viral Video: మీరు టిక్ టాక్ స్టార్ కదా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి వింత ప్రశ్న

మరోసారి మెరిసిన మిల్క్ బ్యూటీ..