Kim Jong Un: మూడో క్షిపణి ప్రయోగించిన కిమ్ మామ.. మిసైల్ ఏమైందంటే..

Missile Test: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్(Kim Jong Un) వరుస క్షిపణి ప్రయోగాలతో అమెరికాపై ఒత్తిడి పెంచుతున్నారు. కేవలం ఒక్క నెలలోనే ప్రయోగాలు నిర్వహించటం ఇది మూడో సారి కావటంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Kim Jong Un: మూడో క్షిపణి ప్రయోగించిన కిమ్ మామ.. మిసైల్ ఏమైందంటే..
Kim Jong Un
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Mar 18, 2022 | 9:45 AM

Kim Jong Un: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ వరుస క్షిపణి ప్రయోగాలతో(Missile Test) అమెరికాపై ఒత్తిడి పెంచుతున్నారు. ఒక పక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో(Russia ukraine War) ఆందోళనలో ఉన్న ప్రపంచదేశాలకు.. ఈ పరీక్షలు మరింత ఆందోళనను కలిగిస్తున్నాయి. అత్యంత ప్రమాదకరమైన అణ్వాయుధ ప్రయోగాలు ప్రధానంగా పక్కనే ఉన్న దక్షిణ కొరియా, జపాన్ లకు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ నెలలో రెండు ప్రయోగాలు చేసిన నార్త్ కొరియా.. తాజాగా మరో మిసైల్ టెస్ట్ చేపట్టింది. ఆదివారం నాడు తూర్పు తీరం సముద్రం వైపు అత్యంత శక్తిమంతమైన బాలిస్టిక్ మిసైల్ ని నార్త్ కొరియా మిలిటరీ ప్రయోగించింది. దీనిని రాజధాని పాంగ్యాంగ్ సమీపంలోని సునాన్ నుంచి ప్రయోగించారు. ఈ వరుస ప్రయోగాలపై దక్షిణ కొరియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అయితే.. ఉత్తర కొరియా తాజాగా ప్రయోగించిన క్షిపణి పరీక్ష విఫలమైందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఓ నివేదికలో వెల్లడించారు.

2017 నుంచి ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణి పరీక్ష చేస్తుందని అనుమానాలున్నాయి. ఇప్పుడు ప్రయోగించిన క్షిపణి 2020లో ఉత్తర కొరియా మిలిటరీ పరేడ్‌లో మొదటిసారి ప్రదర్శించిన హాసంగ్‌-17 అయి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కొత్త సంవత్సర ప్రారంభం నుంచి నార్త్ కొరియా ఏకంగా 10 సార్లు మిసైల్ పరీక్షలు నిర్వహించి తన దూకుడును పెంచింది.

ఇవీ చదవండి..

Traffic Challan: తెలంగాణలో వాహనదారుల నుంచి వచ్చిన పెండింగ్​ చలాన్ల కలెక్షన్ ఎంతంటే..

Insurance: ఇన్సూరెన్స్ కవర్ మీ అవసరాలకు సరిపోతుందా..? అయితే ఇలా ప్లాన్ చేసుకోండి..

Investment: పెట్టుబడుల వివరాలు ఉద్యోగి HRకు ఇవ్వకపోతే ఏం జరుగుతుంది..? పూర్తి వివరాలు..