Russia-Ukraine War: ప్రపంచ కోర్టు చెప్పినా వినేది లేదు.. ఉక్రెయిన్‌పై విచ్చలవిడిగా బాంబుల వర్షం..
ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఐసీజే ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తోంది రష్యా. ఉక్రెయిన్‌లోని కీలక నగరాలపై విచ్చలవిడిగా బాంబు దాడులు చేస్తోంది. ఖార్కివ్‌లో స్కూల్, కమ్యూనిటీ సెంటర్‌పై..
ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఐసీజే (UN Security Council)ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తోంది రష్యా. ఉక్రెయిన్‌లోని కీలక నగరాలపై విచ్చలవిడిగా బాంబు దాడులు చేస్తోంది. ఖార్కివ్‌లో స్కూల్, కమ్యూనిటీ సెంటర్‌పై పుతిన్ సేన అటాక్ చేసింది. ఈ ఘటనలో 21 మంది మృతి చెందగా..పలువురికి గాయాలయ్యాయి. రష్యా దాడిలో ఉక్రెయిన్ నటి ఒక్సెనా షెట్స్ మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇక మరియుపోల్‌లో ఐతే పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. రష్యా దాడులతో హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి. తాగేందుకు నీరు, తినేందుకు తిండి, కరెంట్ సరఫరా నిలిచిపోయి అంధకారంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇవాళ మరోసారి రష్యా, ఉక్రెయిన్ మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి. ఇప్పటికే పలుమార్లు చర్చించినా పురోగతి లేదు. దీంతో ఇవాళ జరిగే సమావేశంలోనైనా ఇరు దేశాల మధ్య రాజీ కుదురుతుందా అన్నది ఉత్కంఠ రేపుతోంది.
తమకు సాయం చేయడానికి సెంట్రల్ యూరప్‌లో అడ్డుగా ఉన్న గోడను బద్దలు కొట్టాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ జర్మనీకి విజ్ఞప్తి చేశారు. ఇది బెర్లిన్ గోడ కాదని, రష్యా వేస్తున్న ప్రతి బాంబుతో ఈ గోడ పెరుగుతూ పోతోందని, దీన్ని బద్దలు కొట్టాలని- జర్మనీ పార్లమెంటును ఉద్దేశించి జెలెన్‌స్కీ పిలుపునిచ్చారు. జర్మనీ చేపట్టాల్సిన నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని జెలెన్ స్కీ పిలుపునిచ్చారు.
ఇదిలావుంటే.. జెలెన్‌స్కీ గొంతుచించుకున్నా, నాటో వైఖరి మారలేదు. ఉక్రెయిన్ యుద్ధంలో సైన్యంతో వచ్చి తాము రిస్క్‌ను పెంచలేమని నాట్కో తేల్చేసింది. అన్ని సభ్యదేశాల సైన్యాల భద్రత తమకు ముఖ్యమని నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోలెన్‌బర్గ్ చెప్పారు. అయితే ఉక్రెయిన్ ప్రజల ఇబ్బందులు తమని కలచివేస్తున్నాయని, వారికి మద్దతు పలుకుతున్నట్లు స్టోలెన్‌బర్గ్ వివరించారు.
ఇవి కూడా చదవండి: ఈ ఫోటోలో పిల్లి స్టెప్స్ ఎక్కుతోందా? దిగుతోందా?.. కనుక్కుంటే మీరు జీనియస్.
Health Benefits: చిటికెడు నల్ల ఉప్పుతో ఎన్నో చిక్కు సమస్యలకు చెక్ పెట్టండి.. ఎలానో తెలుసా..