International Sex Worker’s Day 2023: నేడు అంతర్జాతీయ సెక్స్ వర్కర్స్ దినోత్సవం.. వివక్ష, దోపిడీకి వ్యతిరేకంగా గళమెత్తిన రోజు..

సెక్స్ వర్కర్.. ఈ పేరు వినగానే ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తారు. ఫైనల్‌గా మాత్రం చాలా మంది ప్రజలు వారిని చీత్కరించుకుంటారు. వారు కనిపిస్తే చాలు ఏహ్యభావంతో చూస్తారు. పైగా వారిని సూటిపోటి మాటలతో మానసికంగా దాడి చేస్తారు. ఇక కొందరు మగాళ్ల రూపంలో ఉన్న మృగాళ్లు.. సెక్స్ వర్కర్లను దారుణంగా దోచుకుంటారు. ఈ దోపిడీ, ఈ వివక్ష, ఈ చీత్కారలకు వ్యతిరేకంగా గళమెత్తారు

International Sex Worker's Day 2023: నేడు అంతర్జాతీయ సెక్స్ వర్కర్స్ దినోత్సవం.. వివక్ష, దోపిడీకి వ్యతిరేకంగా గళమెత్తిన రోజు..
International Sex Workers Day
Follow us

|

Updated on: Jun 02, 2023 | 7:27 AM

సెక్స్ వర్కర్.. ఈ పేరు వినగానే ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తారు. ఫైనల్‌గా మాత్రం చాలా మంది ప్రజలు వారిని చీత్కరించుకుంటారు. వారు కనిపిస్తే చాలు ఏహ్యభావంతో చూస్తారు. పైగా వారిని సూటిపోటి మాటలతో మానసికంగా దాడి చేస్తారు. ఇక కొందరు మగాళ్ల రూపంలో ఉన్న మృగాళ్లు.. సెక్స్ వర్కర్లను దారుణంగా దోచుకుంటారు. ఈ దోపిడీ, ఈ వివక్ష, ఈ చీత్కారలకు వ్యతిరేకంగా గళమెత్తారు ప్రపంచ వ్యాప్తంగా సెక్స్ వర్కర్లు. అలా పుట్టిందే.. అంతర్జాతీయ సెక్స్ వర్కర్స్ డే. నేడే అంతర్జాతీయ సెక్స్ వర్కర్ డే. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్ 2 న జరుపుకుంటారు. ఈ రోజు సెక్స్ వర్కర్లు ప్రబలమైన దోపిడీని, వారి ఎదుర్కొంటున్న భయంకరమైన పరిస్థితులను హైలైట్ చేయడమే కాకుండా.. సెక్స్ వర్కర్ల హక్కులపై అవగాహన కలిగించడానికి, వివక్షను ఎదుర్కొనే ఉద్దేశంతో ఈ రోజును జరుపుకుంటారు. సమాజంలో దోపిడీకి, పీడితకు వ్యతిరేకంగా.. బాధిత సెక్స్ వర్కర్లకు గౌరవం ఇవ్వడానికి స్మారకంగా 1976 నుండి ఈ రోజును జరుపుకుంటున్నారు.

అంతర్జాతీయ సెక్స్ వర్కర్స్ డే 2023 చరిత్ర..

జూన్ 2, 1975న సుమారు 100 మంది సెక్స్ వర్కర్లు ఫ్రాన్స్‌లోని లియోన్‌లోని సెయింట్-నిజియర్ చర్చి వద్ద గుమిగూడి, తాము జీవితం జరుగుతున్న దోపిడీ, దాడులపై ఆగ్రహం, నిరసన వ్యక్తం చేశారు. తమ సందేశాన్ని తెలియజేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. ‘మా పిల్లలు, మా తల్లులు జైలుకు వెళ్లడం ఇష్టం లేదు’ అని రాసి ఉన్న బ్యానర్‌ను స్టీపుల్ నుండి వేలాడదీశారు. పోలీసుల వేధింపులను ఆపాలని, తమ ఉపాధి కోసం హోటళ్లను తిరిగి తెరవాలని, సెక్స్ వర్కర్ల హత్యలపై సరైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తమ బాధలను చెప్పుకునేందుకు మీడియా ప్రచారాన్ని కూడా ప్రారంభించారు.

అంతర్జాతీయ సెక్స్ వర్కర్స్ డే 2023 – థీమ్..

అంతర్జాతీయ సెక్స్ వర్కర్స్ డే 2023 థీమ్ ‘న్యాయానికి ప్రాప్యత’. ఈ థీమ్ ప్రతి సంవత్సరం స్థిరంగా ఉంటుంది. సెక్స్ వర్కర్లందరికీ హక్కులు, న్యాయం కోసం డిమాండ్ చేసే దిశగా అందరూ సమిష్టిగా పని చేసేలా చేయడం ఈ థీమ్ లక్ష్యం.

ఇవి కూడా చదవండి

అంతర్జాతీయ సెక్స్ వర్కర్స్ డే 2023 ప్రాముఖ్యత..

అంతర్జాతీయ సెక్స్ వర్కర్స్ డే చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడానికి, మూస పద్ధతులను, వివక్షతను రూపుమాపడానికి అవకాశాన్ని ఇస్తుంది. అలాగే, ప్రపంచవ్యాప్తంగా సెక్స్ వర్కర్ల హక్కులను రక్షించడానికి అవకాశాన్ని అందిస్తుంది. వారిని సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచడం, వారి దైనందిన జీవితంలో భాగమైన వివక్ష, దోపిడీ, పేదరికాన్ని అంతం చేయడం దీని లక్ష్యం.

అంతర్జాతీయ సెక్స్ వర్కర్స్ డే 2023 – సందేశం, కోట్స్..

1. ఆశ్రయం, జీవనోపాధి కోసం సెక్స్ వర్కర్లుగా మారిన ఎంతోమంది.. సమాజంలో ఛీత్కారాలు, వివక్ష ఎదుర్కొంటున్నారు. అయితే, వారు అనుభవించే కష్టాలు, వారు ఈ మార్గంలోకి పయనించడానికి గల కారణాలను ఎవరూ అర్థం చేసుకోలేరు. ఇకనైనా.. వారి విషయంలో ప్రజల దృక్పథం మారాలి. వారి కష్టనష్టాలను అర్థం చేసుకుని, వారిని కూడా మనుషుల్లాగే చూడండి.

2. బహిరంగంగా సెక్స్ వర్కర్ గురించి విన్నప్పుడు తల దించుకోకండి; వారు సమానత్వానికి అర్హులు, స్వేచ్ఛగా ప్రయాణించే హక్కు వారికి ఉంది.

3. సెక్స్ వర్కర్లకు ఎస్కార్ట్ చేస్తున్న వారు కూడా వారిలాంటి ప్రజలే. ప్రతి ఒక్కరికీ గౌరవం ఉన్నప్పుడు.. సెక్స్ వర్కర్లు మాత్రం ఎందుకు దోపిడీకి గురవ్వాలి. వారికి కూడా గౌరవం దక్కాల్సిందే.

4. వేశ్యలు జీతం కోసం పని చేస్తారు. కానీ దుర్వినియోగం, దోపిడీ కోసం కాదు. వారు ఇతరుల సహాయాన్ని అభ్యర్థించరు; బదులుగా వారు దోపిడీని అంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు

5. ఏ మానవుడూ దుర్వినియోగం, దోపిడీకి అర్హుడు కాదు. అంతర్జాతీయ వేశ్య దినోత్సవం సెక్స్ వర్కర్ల దోపిడీకి వ్యతిరేకంగా మాట్లాడే రోజు.

6. మనుషులుగా అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడటం, బతుకుదెరువు కోసం ప్రతిరోజు పోరాడే మహిళల పక్షాన నిలబడటం మన బాధ్యత.

మరిన్ని ఆఫ్‌బీట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..