AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia-Ukraine War: రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో తీర్మానం.. ఉక్రెయిన్‌కు అనుకూలంగా 143 దేశాలు.. భారత్‌ మాత్రం ఓటింగ్‌కు దూరంగా..

ఉక్రెయిన్‌లోని 4 ప్రాంతాలపై రష్యా ఆక్రమణకు సంబంధించి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. 143 దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించాయి. భారత్ మాత్రం ఈ ఓటింగ్‌కు దూరంగా ఉంది.

Russia-Ukraine War: రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో తీర్మానం.. ఉక్రెయిన్‌కు అనుకూలంగా 143 దేశాలు.. భారత్‌ మాత్రం ఓటింగ్‌కు దూరంగా..
UNGA
Sanjay Kasula
|

Updated on: Oct 13, 2022 | 9:43 AM

Share

నాలుగు ఉక్రెయిన్ భూభాగాలను రష్యా ఆక్రమించడాన్ని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్‌జీఎ) బుధవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మొత్తం 143 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా.. ఐదు దేశాలు వ్యతిరేకంగా ఓటేశాయి. భారత్‌తో సహా 35కి పైగా సభ్య దేశాలు ఈ ప్రతిపాదనకు దూరంగా ఉండి ఓటింగ్‌లో పాల్గొనలేదు. భద్రతా మండలిలో రష్యా ఇదే విధమైన తీర్మానాన్ని వీటో చేసిన కొన్ని రోజుల తరువాత.. ఇందులో భారతదేశం పాల్గొనలేదు.

రష్యాపై అభిశంసన తీర్మానం ఆమోదించబడినప్పుడు జెలెన్స్కీ ఏం చెప్పారు?

రష్యాపై అభిశంసన తీర్మానం ఆమోదం పొందడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. “ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత.. ఐక్యరాజ్యసమితి చార్టర్  సూత్రాలను రక్షించడం” అనే ఈ రెండు చారిత్రాత్మక తీర్మానానికి మద్దతు ఇచ్చిన 143 రాష్ట్రాలకు కృతజ్ఞతలని జెలెన్స్కీ ట్వీట్ చేశారు.

పుతిన్ డిమాండ్‌కు వ్యతిరేకంగా భారత్ ఓటు

సోమవారం (అక్టోబర్ 10) ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో రష్యాకు భారత్ పెద్ద ఝలక్ ఇచ్చింది. రహస్య బ్యాలెట్‌ను నిర్వహించాలన్న పుతిన్‌ డిమాండ్‌ను భారత్‌ తిరస్కరించింది. వాస్తవానికి, ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను అక్రమంగా ఆక్రమించినందుకు రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ముసాయిదా తీర్మానం తీసుకురాబడింది. రష్యాను ఖండించడానికి బహిరంగ ఓటు వేయాలని తీర్మానం కోరింది. అయితే పుతిన్ దానిపై రహస్య ఓటు వేయాలని కోరుకున్నారు. మరోవైపు, పుతిన్ ఈ డిమాండ్‌కు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో భారత్ ఓటు వేసింది. ఈ ప్రతిపాదనను అల్బేనియా తీసుకొచ్చింది.

అనుకూలంగా 107 ఓట్లు రాగా, 13 దేశాలు వ్యతిరేకించాయి

అల్బేనియన్ ప్రతిపాదనకు అనుకూలంగా 107 ఓట్లు రాగా, 13 దేశాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. మరోవైపు చైనా, ఇరాన్‌, రష్యా సహా 24 దేశాలు తీర్మానంపై ఓటింగ్‌ చేయలేదు. సెప్టెంబరు చివరి వారంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారికంగా ఉక్రెయిన్‌లోని దొనేత్సక్, లుహాన్స్క్, ఖెర్సన్‌తోపాటు జాపోరిజ్జియా.. ఈ నాలుగు ప్రాంతాల విలీనాన్ని ప్రకటించే పత్రాలపై సంతకం చేశారు.

రష్యా దాడులను ముమ్మరం చేసింది

క్రిమియా బ్రిడ్జి పేలుడు తర్వాత ఈ వారం రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో రష్యా ఇప్పుడు ఉక్రెయిన్‌పై వైమానిక దాడులను ముమ్మరం చేసింది. నిన్న కూడా, కైవ్‌లో శీఘ్ర క్షిపణి దాడులు జరిగాయి. రోజంతా డేంజర్ సైరన్‌లు వినిపించాయి. ఉక్రెయిన్ ప్రభుత్వం పౌరులను ఎయిర్ రైడ్ షెల్టర్‌కు వెళ్లాలని ఆదేశించింది. మరోవైపు రష్యా దూకుడు చర్యను ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ తీవ్రంగా ఖండించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం

అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే