AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hurricane Helene: ఉత్తర కరోలినాలో హెలెన్ తుఫాన్ విధ్వంసం.. 100 మంది మృతి.. నిలిచిన విద్యుత్, మొబైల్ సేవలు

అగ్రరాజ్యం అమెరికాలో వర్షాలు బీభత్సం సృష్టించింది. సౌత్ ఈస్టర్న్ అమెరికా తుఫాను హెలెన్ భీకర రూపం దాల్చింది. ఎక్కడ చూసినా విధ్వంసకర దృశ్యం కనిపిస్తుంది. రోడ్లపై పార్క్ చేసిన కార్లు, ఇళ్లు నీటిలో కొట్టుకుపోతున్నాయి. ఈ తుఫాను వాళ్ళ కురిసిన వర్షం నీటితో డల్లాస్ కౌబాయ్స్ స్టేడియంను 51,000 సార్లు నింపగలదు లేదా 60 మిలియన్ల ఒలింపిక్ సైజు స్విమ్మింగ్ పూల్‌లను నీటితో నింపవచ్చు.

Hurricane Helene: ఉత్తర కరోలినాలో హెలెన్ తుఫాన్ విధ్వంసం.. 100 మంది మృతి.. నిలిచిన విద్యుత్, మొబైల్ సేవలు
Hurricane Helene
Surya Kala
|

Updated on: Oct 01, 2024 | 8:49 PM

Share

అగ్రరాజ్యం అమెరికాలో వర్షాలు బీభత్సం సృష్టించింది. సౌత్ ఈస్టర్న్ అమెరికా తుఫాను హెలెన్ భీకర రూపం దాల్చింది. ఎక్కడ చూసినా విధ్వంసకర దృశ్యం కనిపిస్తుంది. రోడ్లపై పార్క్ చేసిన కార్లు, ఇళ్లు నీటిలో కొట్టుకుపోతున్నాయి. ఈ తుఫాను వాళ్ళ కురిసిన వర్షం నీటితో డల్లాస్ కౌబాయ్స్ స్టేడియంను 51,000 సార్లు నింపగలదు లేదా 60 మిలియన్ల ఒలింపిక్ సైజు స్విమ్మింగ్ పూల్‌లను నీటితో నింపవచ్చు.

భారీ వర్షం సృష్టిస్తున్న విధ్వంసం నిపుణులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ వర్షాల కారణంగా ఇప్పటివరకు 100 మందికి పైగా మరణించినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ సంఖ్య 600 వరకు పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. నివేదికల ప్రకారం ఇప్పటి వరకూ కురిసిన వర్షంతో తాహో సరస్సు నిండి పోతుందని తెలుస్తోంది. ఈ వర్షంతో అమెరికాలోని నార్త్ కరోలినా 3.5 అడుగుల మేర వరద ముంచెత్తుతుంది.

ఇవి కూడా చదవండి

భయంకరమైన విధ్వంసం సృష్టించిన హెలెన్

హెలెన్ హరికేన్ సౌత్ ఈస్టర్న్ అమెరికాలో భారీ విధ్వంసం సృష్టించింది, నీరు కనిపించని ప్రాంతం అంటూ లేనే లేదు. నేషనల్ ఓషన్ ఎయిర్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) చీఫ్ క్లార్క్ మాట్లాడుతూ.. ఈ వర్షం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉందని చెప్పారు. ఇదే విషయంపై ప్రైవేట్ వాతావరణ నిపుణుడు ర్యాన్ మే మాట్లాడుతూ ఇప్పుడు కురిసిన వర్షం చాలా అధికం అని.. 20 ట్రిలియన్ గ్యాలన్ల మేర వర్షం నీరు కురిసినట్లు అంచనా వేసినట్లు చెప్పారు. జార్జియా, టేనస్సీ, కరోలినా, ఫ్లోరిడాలోనే ఈ రేంజ్ లో వర్షం కురిసినట్లు చెప్పారు.

తుపాను కారణంగా నిలిచినవిద్యుత్‌ సరఫరా

ఉత్తర కరోలినాలోని ఆషెవిల్లేలో తుఫాను కారణంగా పరిస్థితి దారుణంగా ఉందని.. భయంకరంగా ఉందని తెలుస్తోంది. ఆ ప్రాంతంలో విద్యుత్, మొబైల్ సేవలు నిలిచిపోయాయి. వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో రోడ్లు మూసుకుపోయాయని, బాధిత ప్రజలకు నీరు, ఆహారం, ఇతర సామాగ్రిని అందించేందుకు విమాన మార్గాలను ఉపయోగిస్తున్నామని అధికారులు తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..