Taliban Attack: ఆప్ఘనిస్థాన్‌లో మరోసారి మరణహోమం సృష్టించిన తాలిబన్లు.. ఇళ్లపై కాల్పులు.. 100 మంది పౌరుల దుర్మరణం

ఆప్ఘనిస్థాన్ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. ఆ దేశంలోని కందహార్ ప్రావిన్సు స్పిన్ బోల్డాక్ జిల్లాలో ఉగ్రవాదులు పౌరుల ఇళ్లపై మెరుపుదాడికి దిగారు.

Taliban Attack: ఆప్ఘనిస్థాన్‌లో మరోసారి మరణహోమం సృష్టించిన తాలిబన్లు.. ఇళ్లపై కాల్పులు.. 100 మంది పౌరుల దుర్మరణం
Taliban Attack
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 23, 2021 | 11:58 AM

Hundred civilians killed in Afghanistan: ఆప్ఘనిస్థాన్ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. ఆ దేశంలోని కందహార్ ప్రావిన్సు స్పిన్ బోల్డాక్ జిల్లాలో ఉగ్రవాదులు పౌరుల ఇళ్లపై మెరుపుదాడికి దిగారు. తాలిబాన్ ఉగ్రవాదులు ఇళ్లపై కాల్పులు జరపడంతోపాటు, ఇళ్లల్లోకి జోరబడి లూటీ చేశారు. ఉగ్రవాదుల కాల్పుల్లో 100 మంది పౌరులు ప్రాణాలను కోల్పోయారని ఆఫ్ఘాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి మీర్వైస్ స్టానెకాయ్ తెలిపారు.

మరోవైపు తాలిబాన్లు స్పిన్ బోల్డాక్ ప్రాంతాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. ముష్కరులు గృహాలు దోచుకుంటూ కాల్పులకు తెగబడ్డారని వీడియో ఫుటేజీలో స్పష్టంగా వెల్లడైంది. ఉగ్రవాదులు మోటారు బైకులపై సంచరిస్తూ మారణకాండ కొనసాగించారని స్థానిక మీడియా పేర్కొంది. ఓ ఇంటిపై తాలిబాన్ జెండాలను ఎగురవేశారు. మరోవైపు. తాలిబాన్లు ఈద్ ముందురోజు కందహార్ ప్రావిన్షియల్ కౌన్సిల్ సభ్యుడిని బయటకు తీసుకువెళ్లి కాల్చి చంపారు. స్పిన్ బోల్డాక్ ప్రాంతంలోని నేలపై పౌరుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

మరోవైపు, ఆఫ్ఘనిస్థాన్‌ సరిహద్దు ప్రాంతాలు 90 శాతం తాలిబన్ల ఆధీనంలోకి వచ్చినట్టు వారి ప్రతినిధి రష్యా మీడియా సంస్థ ఆర్‌ఐఏ నొవొస్తీకి తెలిపారు. ఆఫ్ఘన్‌కు తజికిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, తుర్క్‌మెనిస్థాన్‌, ఇరాన్‌తో సరిహద్దులు ఉన్నాయి. ఆఫ్ఘన్‌ నుంచి అమెరికా, నాటో దళాలు వెనుతిరగడంతో తాలిబన్లు ఒక్కో ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు.