Haj 2021: హజ్ యాత్రలో యాత్రీకుల భద్రత కోసం తొలిసారిగా మహిళా సైనికులు సౌదీ అరేబియా చారిత్రాత్మక నిర్ణయం

ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే హజ్ యాత్ర ప్రశాంతంగా కొనసాగుతోంది. కరోనా కారణంగా మక్కా యాత్రకు పరిమితులు విధించారు.

Haj 2021: హజ్ యాత్రలో యాత్రీకుల భద్రత కోసం తొలిసారిగా మహిళా సైనికులు సౌదీ అరేబియా చారిత్రాత్మక నిర్ణయం
Haj 2021
Follow us

|

Updated on: Jul 23, 2021 | 1:58 PM

Haj 2021: ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే హజ్ యాత్ర ప్రశాంతంగా కొనసాగుతోంది. కరోనా కారణంగా మక్కా యాత్రకు పరిమితులు విధించారు. చాలా దేశాల నుంచి హజ్ యాత్రకు వెళ్లేందుకు ప్రజలకు అనుమతి లభించలేదు. అయినప్పటికీ పరిమిత భక్తులతో హజ్ యాత్ర దిగ్విజయంగా నడుస్తోంది. ఈ సంవత్సరం హజ్ యాత్రలో ఒక ప్రత్యేకత చోటు చేసుకుంది. ఇప్పటివరకూ హజ్ యాత్రలో భద్రతను పురుష సైనికులు మాత్రమే పర్యవేక్షించే వారు. ఇప్పుడు తొలిసారిగా మహిళా సైనికులను  ఇందుకోసం నియమించారు.

సౌదీ అరేబియాలో మహిళా సాధికారతను ప్రోత్సహించడం ద్వారా చారిత్రాత్మక చర్య తీసుకున్నారు. దీని లో భాగంగా  సౌదీ హజ్ సందర్భంగా మక్కాలో మహిళా సైనికులను మోహరించింది. ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో హజ్ యాత్రికులు ఇక్కడికి చేరుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి తొలిసారిగా మహిళల కోసం ఈ భద్రతా సేవను ప్రారంభించారు. వారు మక్కా, మరియు మదీనాలోని అనేక పవిత్ర ప్రదేశాలలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ మహిళలు పొడవైన జాకెట్,  మరియు వదులుగా ఉన్న ప్యాంటుతో ఖాకీ యూనిఫాం ధరిస్తున్నారు. వారి జుట్టును కప్పడానికి ఒక టోపీ ఉపయోగించారు. మక్కాలో పోస్ట్ చేసిన మొదటి మహిళా సెక్యూరిటీ గార్డు పేరు మోనా. ఆమె తన తండ్రి ప్రేరణతో సైన్యంలో చేరిన సౌదీ మహిళా సైనికుల సమూహంలో భాగం.

కాబాలో పోస్ట్ చేసిన మహిళ పేరు సమర్. ఆమె మాట్లాడుతూ, “ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించే యాత్రికుల భద్రత కోసం నన్ను నియమించినందుకు నేను గర్విస్తున్నాను. మన మతాన్ని పరిరక్షించడానికి ఇది ఒక మార్గం. ఈ దేశం అదేవిధంగా ఇక్కడకు వచ్చే అల్లాహ్ యొక్క అతిథుల రక్షణ కోసం నేను పనిచేయడం నాకు సంతోషాన్నిస్తోంది.” అని చెప్పారు.

మక్కాలో మహిళా సైనికుల ఫోటోలను ట్విట్టర్ లో ఆ దేశ ప్రభుత్వం షేర్ చేసింది. ఆ ట్వీట్ ఇక్కడ ఉంది.

Also Read: Taliban Attack: ఆప్ఘనిస్థాన్‌లో మరోసారి మరణహోమం సృష్టించిన తాలిబన్లు.. ఇళ్లపై కాల్పులు.. 100 మంది పౌరుల దుర్మరణం

హఠాత్తుగా చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ టిబెట్ సందర్శన.. ఉవ్వెత్తున రేగిన ఊహాగానాలు