Xi Jinping: హఠాత్తుగా చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ టిబెట్ సందర్శన.. ఉవ్వెత్తున రేగిన ఊహాగానాలు

చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ హఠాత్తుగా టిబెట్ ను సందర్శించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఓ వైపు తమ దేశం వర్షాలు, వరదలతో అల్లాడుతుండగా ఆయన టిబెట్ విజిట్ షాకింగ్ ఇన్సిడెంట్ అంటున్నారు.

Xi Jinping: హఠాత్తుగా చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ టిబెట్ సందర్శన.. ఉవ్వెత్తున రేగిన ఊహాగానాలు
Xi Jinping Tibet Visit
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jul 23, 2021 | 10:28 AM

చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ హఠాత్తుగా టిబెట్ ను సందర్శించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఓ వైపు తమ దేశం వర్షాలు, వరదలతో అల్లాడుతుండగా ఆయన టిబెట్ విజిట్ షాకింగ్ ఇన్సిడెంట్ అంటున్నారు. లాసా లోని బార్ ఖోర్ ఏరియాలో ఆయన గురువారం స్థానికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న వీడియోలు బయటికొచ్చాయి. టిబెటన్ల బౌద్ధ గురువు దలైలామా వింటర్ రెసిడెన్స్ అయిన ‘పొటాలా ప్యాలస్’ వద్ద మాట్లాడిన ఆయన..ఇది టిబెట్ కి శాంతియుత విముక్తిని ప్రసాదించే కట్టడం( మాన్యుమెంట్) అని పేర్కొన్నారు. ఈ నెల 20 న కూడా జిన్ పింగ్.. టిబెట్ భూభాగమైన నింగిత్రి లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ .. 17 పాయింట్లతో తమ దేశం కుదుర్చుకున్న ఒప్పందం కుదిరి 70 ఏళ్ళు అయిందని, పదేళ్ల క్రితం దీని 60 వ యానివర్సరీని పురస్కరించుకుని కూడా తాను ఈ ప్రాంతాన్ని సందర్శించానని చెప్పుకున్నారు. వివక్షకు గురయ్యే ఏ ఒక్క జాతినీ ఆధునిక సోషలిస్టు చైనా ఆవిర్భావంలో తాము విస్మరించే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు. అన్ని జాతులనూ కలుపుకుని పోతామన్నారు.

వారు కూడా నవ చైనా సృష్టిలో భాగస్వాములే అని ఆయన వ్యాఖ్యానించారు. టిబెట్ పై తమదే ఆధిపత్యమని చైనా ఏనాటి నుంచో చైనా చెప్పుకుంటోంది. ఈ భూభాగంపై హక్కు తమదేనంటోంది. అయితే ఐరాసలో భారత ప్రభుత్వం ఈ వాదనను ఖండిస్తూ వస్తోంది. తాజాగా చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ టిబెట్ విజిట్ పై ప్రభుత్వం ఓ కన్నేసి ఉంచింది. గత ఎన్నో దశాబ్దాలుగా టిబెట్ అంశం భారత-చైనా దేశాల మధ్య పరిష్కారం కానిదిగానే ఉంటోంది.

మరిన్ని ఇక్కడ చూడండి: రోజూ ఈ చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారా ? అయితే జాగ్రత్త సుమా.. ఆరోగ్యానికి యమ డేంజర్ అంటున్న నిపుణులు..

పీసీసీ చీఫ్‌గా సిద్ధూ ప్రమాణస్వీకారం చేస్తున్న వేళ.. కాంగ్రెస్ పార్టీలో విషాధ ఛాయలు.. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తుల దుర్మరణం

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే