China floods: చైనాను ముంచెత్తుతున్న భారీ వరదలు..రైల్లో చిక్కుకున్న వందలాది ప్రయాణికులు..12 మంది మృతి
చైనాను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. సెంట్రల్ చైనీస్ సిటీ జెంగ్ జూ లోని సబ్ వేలో వెళ్తున్న ఓ రైలు బోగీలో నడుములోతు నీరు చేరిందని, 12 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు.హెనాన్ ప్రావిన్స్ లో సుమారు కోటి మంది ప్రజలను రక్షించేందుకు..
చైనాను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. సెంట్రల్ చైనీస్ సిటీ జెంగ్ జూ లోని సబ్ వేలో వెళ్తున్న ఓ రైలు బోగీలో నడుములోతు నీరు చేరిందని, 12 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు.హెనాన్ ప్రావిన్స్ లో సుమారు కోటి మంది ప్రజలను రక్షించేందుకు సైనికులు నానా పాట్లు పడుతున్నారు. ఈ రాష్ట్రంలోని పలు నగరాల్లో వీధులతో బాటు సబ్ వేలు కూడా జలమయమయ్యాయి. జెంగ్ జూ ఘటనలో 12 మంది మృతి చెందగా రైల్లోనే తొక్కిసలాట జరిగి 5 గురు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. ట్రెయిన్ నుంచి ప్రయాణికులను కాపాడేందుకు సైనికులు ఓబోగీ రూఫ్ ని కట్ చేయవలసి వచ్చిందని వారు చెప్పారు. రైల్లో కూడా ఇంతటి వరదనీరు చేరడం ఎన్నడూ చూడలేదని వారు అన్నారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. దేశంలో అనేక చోట్ల కమ్యూనికేషన్ సంబంధాలు దెబ్బ తిన్నాయి. తమ తలిదండ్రులు ఈ సిటీలోని ఓ అపార్ట్ మెంట్ లో రెండో అంతస్థులో ఉంటున్నారని, అక్కడి పరిస్థితి ఎలా ఉందొ తెలియడం లేదని ఓ మహిళవాపోయింది.
అంటే రెండో అంతస్థు వరకు కూడా నీరు చేరినట్టు తెలుస్తోందని అంటున్నారు. హెనాన్ ప్రావిన్స్ లో హయ్యెస్ట్ వార్నింగ్ జారీ చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఇక జెంగ్ జూ సిటీ సమీపంలోని డ్యాం ఏ క్షణంలోనైనా దెబ్బ తినవచ్చునని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. అలాగే మరో డ్యాం కూడా 20 మీటర్ల మేర పగుళ్లు విచ్చిందని , ఇది కుప్పకూలితే లక్షలాది ప్రజలకు ముప్పు తప్పదని భయపడుతున్నారు. 60 ఏళ్ళ క్రితం దేశాన్ని ఇంతటి వరదలు ముంచెత్తాయని అధికారులు వెల్లడించారు.
Subway passengers trapped in the water. pic.twitter.com/IyqmKN7WEr
— Manya Koetse (@manyapan) July 20, 2021
This video was shared on Weibo earlier tonight. pic.twitter.com/uPKVQZqWZz
— Manya Koetse (@manyapan) July 20, 2021
మరిన్ని ఇక్కడ చూడండి : News Watch : బె ‘జోష్’…అంతరిక్షయాత్ర దిగ్విజయం..మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )
తండ్రిని…ఏం కాక పడుతుంది ఛార్మి !ఎందుకు అనుకుంటున్నారా..?చివరికి ఎం అయ్యింది..:Charmy Kaur Video.