China Rains: చైనాలో వర్ష బీభత్సం.. జలదిగ్భంధంలో హెనాన్ ప్రావిన్స్ ప్రాంతం.. 12మంది మృతి, పలువురు గల్లంతు!
చైనాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. హెనాన్ ప్రావిన్స్‌లో భారీగా వచ్చిన వరదనీరు పట్టణాలు, గ్రామాలను చుట్టుముట్టాయి. వందల సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోయాయి.
China’s Henan heavy rainfall: చైనాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. హెనాన్ ప్రావిన్స్‌లో భారీగా వచ్చిన వరదనీరు పట్టణాలు, గ్రామాలను చుట్టుముట్టాయి. వందల సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోయాయి. డజన్ల కొద్దీకార్లు నీళ్లల్లో బొమ్మల్లా కదిలాయి. బెంగ్‌జౌలో వరదల్లో 12 మంది మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు. ఇక మెట్రో రైల్‌లో కూడా సగానికిపైగా వరదనీరు చేరింది. రైళ్లు, బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. సరియైన ఆహారం అందక జనం ఇబ్బంది పడుతున్నారు. దాంతో ప్రభుత్వ సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. వరదలో చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
చైనాను మళ్లీ కుండపోత వర్షాలు ముంచెత్తాయి. ఉత్తర చైనాలో తాజాగా కురిసిన భారీ వర్షాలకు ఆరుగురు మృతి చెందినట్లు భావిస్తున్నామని అధికారులు తెలిపారు. దీంతో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షల కారణంగా సంభవించిన వరదల్లో చిక్కుకున్న వారిని తరలిస్తున్నట్లు అధికారులు చెప్పారు. మధ్య చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో భారీ వర్షాలకు రాజధాని జెంగ్‌జౌలో 12 మంది మృతి చెందగా, సుమారు లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు స్థానిక మీడియా జిన్హువా బుధవారం పేర్కొంది.
హెనాన్ ప్రావిన్స్ మరియు జెంగ్జౌ మునిసిపల్ వాతావరణ బ్యూరోలు విపత్తుకు అత్యవసర సేవలను కొనసాగిస్తోంది. ఈ ప్రావిన్స్‌లో భారీ వర్షాలు బుధవారం రాత్రి వరకు కొనసాగుతాయని అంచనా వేసినట్లు జిన్హువా నివేదించింది. మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రధాన నదీ తీరాల్లోని నగరాల వీధులు వరదలు పోటెత్తాయి. అటు లుయాంగ్ నగరంలోని యిహెతాన్ ఆనకట్టలో వర్షపాతం 20 మీటర్ల నమోదు అయ్యినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆనకట్ట ఎప్పుడైనా కూలిపోవచ్చని స్థానిక అధికారులు ప్రకటించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు దిగువ ప్రాంతంలోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెంది ప్రత్యేక విభాగాన్ని వరద పోరాటం, రక్షించడానికి ఆ ప్రాంతానికి పంపినట్లు అధికారులు తెలిపారు. కాగా, విమానాల రాకపోకలతో పాటు విమానాశ్రయానికి బయలుదేరే సబ్‌వేలు, ఇంటర్-సిటీ రైళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జెంగ్జౌ విమానాశ్రయం మంగళవారం సాయంత్రం ప్రకటించింది.
Subway passengers trapped in the water. pic.twitter.com/IyqmKN7WEr
— Manya Koetse (@manyapan) July 20, 2021
This video was shared on Weibo earlier tonight. pic.twitter.com/uPKVQZqWZz
— Manya Koetse (@manyapan) July 20, 2021
Read Also… Big News Big Debate :ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల ఆర్ధిక సాయం..రాబోతున్న దళిత బందు పధకం..