Maglev Train China: మరో అద్భుతాన్ని ఆవిష్కరించిన చైనా.. రెండున్నర గంటల్లో వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించే రైలు..
Maglev Train China: సరికొత్త ఆవిష్కరణలకు, అద్భతాలకు చైనా దేశం పెట్టింది పేరు. ఎన్నో అద్భుతాలకు కేంద్ర బిందువైన చైనా తాజాగా మరో వండర్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. అదే మోగ్లెవ్ రైలు....
Maglev Train China: సరికొత్త ఆవిష్కరణలకు, అద్భతాలకు చైనా దేశం పెట్టింది పేరు. ఎన్నో అద్భుతాలకు కేంద్ర బిందువైన చైనా తాజాగా మరో వండర్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. అదే మోగ్లెవ్ రైలు. గంటకు ఏకంగా 600 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ రైలును తాజాగా చైనా లాంచ్ చేసింది. భూమిపై ప్రయణించే అత్యంత వేగమైన రైలుగా మోగ్లెవ్ రికార్డుల్లోకి ఎక్కింది. ఈ రైలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే బీజింగ్ నుంచి షాంఘైకి కేవలం రెండున్నర గంటల్లో చేరుకోవచ్చని దీని రూపకర్తలు చెబుతున్నారు. ఈ రెండు పట్టణాల మధ్య దూరం సుమారు వెయ్యి కిలోమీటర్లకు పైమాటే.
ఇక ఈ రైలు సాధారణ రైళ్లు ప్రయాణించే ట్రాక్‌పై వెళ్లలేవు. వీటి కోసం ప్రత్యేకంగా ట్రాక్‌ను నిర్మించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ రైళ్లు ట్రాక్‌ను ఆనుకొని కాకుండా కాస్త గాల్లో తేలి ప్రయాణిస్తుంది. అత్యంత బలమైన విద్యుదయస్కాంత శక్తితో గాల్లో తేలుతూ నడుస్తుంది. మాగ్లెవ్ టెక్నాలజీతో రూపొందించిన తేలికపాటి ట్రైన్స్‌ను చైనా ఇప్పటికే ఉపయోగిస్తోంది. ప్రస్తుతం ఈ రైళ్లను కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నడిపిస్తున్నారు. రానున్న రోజుల్లో చైనా వ్యాప్తంగా వీటిని నడిపేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ రైళ్లపై అనేక దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ముఖ్యంగా జపాన్, జర్మనీ దేశాలు ఇప్పటికే చైనాతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. గంటకు 600 కి.మీలకు పైగా వేగంతో దూసుకెళ్లే ఈ రైళ్ల నిర్వహణ అంత సులభమైన విషయం కాదు. భారీ మొత్తంలో నిధులు అవసరమవుతుంటాయి. ఈ కారణంగానే కొన్ని దేశాలు ఈ టెక్నాలజీపై ఆసక్తిగా ఉన్నా వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రైళ్లను వినియోగంలోకి తీసుకురావాలంటే ఇప్పటికే ఉన్న ట్రాక్‌లను పూర్తిగా మార్చాల్సి ఉంటుంది. కాబట్టి కొత్తగా రూట్లను వేయాలి. దీంతో భూమి సేకరణ భారీ ఎత్తున అవసరపడుతుంది. మరి ఈ కొత్త రకం రైళ్లు మరెన్ని సంచలనాలకు తెరతీస్తుందో చూడాలి.
Also Read: Smart Saving Account: ఈ బ్యాంక్ అకౌంట్‌తో అధిక వడ్డీ.. తీసుకోవడం కూడా చాలా ఈజీ.. ఎలానో తెలుసుకోండి..
IT Returns:పెరిగిన ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు.. గత ఐదేళ్ళలో ఎంత మంది రిటర్న్స్ దాఖలు చేశారంటే..