- Telugu News Photo Gallery Spiritual photos History and significance of kondagattu anjaneya swamy temple
Kondagattu: స్వయంభూగా వెలసిన ఆంజనేయస్వామి..40 రోజులు పూజ చేస్తే.. సంతాన ప్రాప్తి.. ఈ క్షేత్రం ఎక్కడంటే
Kondagattu Hanuman: రామభక్త హనుమాన్ కు దేశంలో అనేక దేవాలయాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా హనుమంతుడికి భారీ సంఖ్యలో భక్తులున్నారు.. ఈ నేపథ్యంలో తెలంగాణ లోని కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రం ప్రసిద్ధి పొందింది. కొండలు, లోయలు, సెలయేరుల మధ్యన ఉన్న కొండగట్టు ప్రకృతి సౌందర్యంతో భక్తులను పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది. పవన్, సాయి ధరమ్ తేజ్ వంటి సినీ హీరోలతో పాటు అనేక మంది రాజకీయ నేతలు కూడా స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు.
Updated on: Jul 20, 2021 | 9:18 PM

కొండగట్టు మీద ఉన్న ఆజనేయుని ఆలయం నిర్మణం 400 ఏళ్లకు క్రితం జరిగిందని దేవాలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఇక్కడ ఆంజనేయుడు స్వయం భూ గా వెలిశాడని.. 400 ఏళ్ల క్రితం కొడిమ్యాల పరిగణాల్లో సింగం సంజీవుడు అనే యాదవుడికి అంజనేయ స్వామి కనిపించినట్లు కథనం.. సంజీవుడు ఆవులు మేపుతూ, ఈ కొండ ప్రాంతానికి వచ్చిన సమయంలో ఒక ఆవు మందలోని నుంచి తప్పిపోయింది. ఆ అవును వెదుకుతూ అలసిన సంజీవుడు ఒక చింత చెట్టుకింద సేదదీరుతూ నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు హనుమంతుడు కలలో కనబడి.. తాను కోరంద పొదలో ఉన్నాను. తనకు ఎండ, వాన, ముండ్ల నుండి రక్షణ కల్పించమని.. నీ ఆవు జాడ అదిగో అని చెప్పి అదృశ్యమయ్యాడు.

సంజీవుడు ఉలిక్కిపడి లేచి, ఆవును వెతకగా, 'శ్రీ ఆంజనేయుడు' కంటపడ్డాడు. తన సహచరులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయం నిర్మించాడు. ఓ వైపు నృసింహస్వామి మరో వైపున ఆంజనేయస్వామి ముఖాలు కలిగిన ఆ విగ్రహాన్ని గ్రాస్తులంతా కలిసి ప్రతిష్ఠించారు. ఇక్కడ ఆంజనేయుడు రెండు ముఖాలతో కనిపించడం శంఖు చక్రాలు హృదయంలో సీతారాములను కలిగి ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు.

పూర్వము రామ రావణ యుద్ధము జరుగు కాలమున లక్ష్మణుడు మూర్చనొందగా సంజీవనిని తెచ్చేందుకు హనుమ బయలుదేరుతాడు. అతడు సంజీవనిని తెచ్చునపుడు ముత్యంపేట అనే ఈ మార్గంలో కొంతభాగము విరిగిపడింది. ఆ భాగాన్నే కొండగట్టుగా పిలుస్తున్నారు.

నారసింహస్వామి ముఖం (వక్త్రం) ఆంజనేయస్వామి ముఖం, రెండు ముఖాలతో హనుమంతుడు ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకత. ఇలా ద్విముఖాలతో స్వామివారు ఎక్కడ వెలసినట్లు లేదు. నరసింహస్వామి అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం. కనుక కొండగట్టు ఆంజనేయస్వామి వారు స్వయంగా నారసింహవక్త్రం, శంఖం, చక్రం, వక్షస్థలంలో రాముడు, సీతలతో కలిగిన స్వరూపం కలిగి ఉన్నారు. ఈ గుడిని 300 సంవత్సరాల క్రితం ఒక ఆవులకాపరి సంజీవుడు నిర్మించాడు. ప్రస్తుతం ఉన్న దేవాలయం 160 సంవత్సరాల క్రితం కృష్ణారావు దేశ్‌ముఖ్ తిరిగి నిర్మించారు.

శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడు శ్రీబేతాళ స్వామి. ఈయన ఆలయం కొండపైన నెలకొని ఉంది.

ఈ దేవాయలయంతో పాటు కొండగట్టు దగ్గర కొండల రాయుని స్థావరం, మునుల గుహ, సీతమ్మ కన్నీటి ప్రదేశం, తిమ్మయ్యపల్లె శివారులోని బోజ్జ పోతన గుహలు, అటవీ మార్గం గుండా కొండపైకి పురాతన మెట్లదారి, కొండలరాయుని గట్టు, శ్రీవేంకటేశ్వర ఆలయం, శ్రీరామ పాదుకలు, అందమైన ఆకృతులతో కనువిందు చేసే బండరాళ్లు, హరిత వర్ణంతో స్వాగతం పలికే వృక్షాలు కనువిందు చేస్తాయి. దేవాలయానికి సమీపంలో గుట్ట కింద నిర్మించిన అతి పెద్ద ఆంజనేయస్వామి విగ్రహాలు చూపరులను ఆకర్షిస్తాయి.

ఆంజనేయునికి 40 రోజుల పాటు పూజ చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. విశేష పండగల సమయంలో భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. హైదరాబాద్‌కు 160 కి.మీ.ల దూరంలో ఉన్న కొండగట్టుకు వెళ్లడానికి హైదరాబాద్ ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి.. జగిత్యాలకు వెళ్లే బస్సులు ప్రతి 30 నిమిషాలకో బస్సు, కరీంనగర్ నుంచి ప్రతి 30 నిమిషాలకో బస్సు సర్వీసులను టీఎస్ ఆర్టీసీ నిర్వహిస్తోంది. అలాగే ప్రైవేటు క్యాబ్‌లు, ఆటోల సౌకర్యం కూడా ఉంది




