Costly Ice Cream: ఈ ఐస్‌క్రీమ్ చాలా కాస్లీ గురూ..! ఒక్క స్కూప్ ధర అక్షరాల రూ. 60 వేలు.. అంతలా ఏముందనేగా..
Costly Ice Cream: మారుతోన్న కాలానికి అనుగుణంగా ఐస్‌క్రీమ్‌ల తయారీలోనూ మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు బండ్లకు మాత్రమే పరిమితమైన ఐస్‌క్రీమ్‌ల కోసం ప్రస్తుతం ప్రత్యేకంగా షోరూమ్‌లు సైతం...
Costly Ice Cream: మారుతోన్న కాలానికి అనుగుణంగా ఐస్‌క్రీమ్‌ల తయారీలోనూ మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు బండ్లకు మాత్రమే పరిమితమైన ఐస్‌క్రీమ్‌ల కోసం ప్రస్తుతం ప్రత్యేకంగా షోరూమ్‌లు సైతం ఓపెన్ అయ్యాయి. అదే విధంగా ఐస్‌క్రీమ్‌ల ధరలు కూడా బాగా పెరిగిపోయాయి. క్రీం స్టోన్ వంటి వాటిల్లో ఐస్‌క్రీమ్ తినాలంటే తక్కువలో తక్కువ రూ. 200 చెల్లించుకోవాల్సిందే. అయితే మీకు ఇప్పటి వరకు తెలిసిన అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్ ఎంత ఉండి ఉండొచ్చు.. రూ. 500 మహా అయితే వెయ్యి రూపాయాలు అంటారా.? కానీ ఒక్క స్కూప్ ఐస్‌క్రీమ్ ధర రూ. 60,000 ఉంటుందంటే నమ్ముతారా? నమ్మడానికి కాస్త కాష్టంగా ఉన్నా ఇది నిజమే. ఏంటీ ఈ ఐస్‌క్రీమ్‌ను ఏమైనా బంగారంతో చేస్తారా.. అని అనుకుంటున్నారా? అవును బంగారంతోనే చేస్తారు.
వివరాల్లోకి వెళితే.. ప్రముఖ ట్రావెల్ వ్లాగర్ షెనాజ్ ట్రెజరీ ఇటీవల విహారయాత్రకోసం దబాయ్ వెళ్లారు. ఆ సమయంలో ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌ను ఆమె ప్రపంచానికి పరిచయం చేశారు. దుబాయ్‌లోని జుమేరా రోడ్‌లో ఉన్న ఓ ఐస్‌క్రీమ్ పార్లర్‌లో ఈ ఐస్‌క్రీమ్ లభిస్తుంది. ఈ ఐస్‌క్రీమ్ తయారీలో ఖరీదైన వెనీలా బీన్స్‌ను వాడుతారు. అంతేకాకుండా ఇందులో తినగలిగే బంగారాన్ని కూడా ఉపయోగిస్తారు. బ్లాక్ డైమండ్ అని పిలిచే ఈ ఐస్‌క్రీమ్ తయారీ వీడియోను షెనాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘రూ. 60 వేలు విలువ చేసే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌ను తనకు మాత్రం ఉచితంగా అందించారు’ అంటూ క్యాప్షన్ జోడించారు షెనాజ్. మరి ఈ బంగారం లాంటి ఐస్‌క్రీమ్‌ను మీరూ ఓసారి చూసేయండి.
View this post on Instagram
Also Read: Peddi Reddy : ‘జగనన్న పచ్చ తోరణం’లో అనుకున్న ప్రగతి సాధించలేకపోయామన్న పెద్దిరెడ్డి
Smart Saving Account: ఈ బ్యాంక్ అకౌంట్‌తో అధిక వడ్డీ.. తీసుకోవడం కూడా చాలా ఈజీ.. ఎలానో తెలుసుకోండి..