AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాలుగు రోజులగా కురుస్తున్న వర్షాలు.. హవాయిని ముంచెత్తిన వరదలు.. ఎమర్జెన్సీ ప్రకటించిన ఐలండ్ స్టేట్..

Poor Weather: అమెరికాలోని ఐలండ్ స్టేట్ హవాయిని వరదలు వణికిస్తున్నాయి. నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఈ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. హవాయిలోని..

నాలుగు రోజులగా కురుస్తున్న వర్షాలు.. హవాయిని ముంచెత్తిన వరదలు.. ఎమర్జెన్సీ ప్రకటించిన ఐలండ్ స్టేట్..
Sanjay Kasula
|

Updated on: Mar 10, 2021 | 10:23 PM

Share

Hawaii Declares Emergency: అమెరికాలోని ఐలండ్ స్టేట్ హవాయిని వరదలు వణికిస్తున్నాయి. నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఈ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. హవాయిలోని కౌపాకులా డ్యామ్ ప్రమాదకర పరిస్థితుల్ని దాటి ప్రవహిస్తోంది. వరదల వల్ల భారీగా అస్తినష్టం జరిగిందని ప్రకటించారు గవర్నర్ డేవిడ్.

పసిఫిక్ ఓషన్‌లో ఉన్న హవాయి దీవుల్ని వర్షాలు వణికిస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్థంభించిపోయింది. ఒక్క ప్రాంతం అని కాకుండా.. రాష్ట్రం మొత్తం వానలు దంచి కొడుతున్నాయి. వర్షాలకు రిజర్వాయర్లన్నీ నిండిపోయాయి. హవాయిలోని రెండు డ్యామ్‌లు ప్రమాదకర పరిస్థితిని దాటి ప్రవహిస్తున్నాయి.

కౌపాకులా డ్యామ్‌ మీదుగా నీరు ప్రవహిస్తోంది. వరదల పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నా.. డ్యామ్‌కి ఇబ్బంది లేదని ప్రకటించారు అధికారులు. హవాయి కేపిటల్ హొనలాలూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ హలేవియా పట్టణాన్ని ఖాళీ చేయాలని ప్రజల్ని ఆదేశించింది. డ్యామ్‌ల వద్దనున్న గ్రామాలతో పాటు పరీవాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.

హైకూ ప్రాంతంలో 8 గంటల్లో 36 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వర్షాల వల్ల చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. ఇళ్లు కూలిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. విద్యుత్ సరఫరా ఆగిపోయింది. సమాచార వ్యవస్థ కుప్పకూలింది. ఆగకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని… ఎప్పుడు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.

వరదలకు కొండ చరియలు విరిగిపడ్డాయి. హవాయికి టూరిస్ట్‌ల తాకిడి ఎక్కువ. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో టూరిస్టులు కూడా ఎటూ వెళ్లవద్దని.. హోటళ్లలోనే ఉండాలని ప్రభుత్వం అదేశించింది. హవాయిలో 132 డ్యామ్‌లు ఉన్నాయి. ఇందులో రెండు డ్యాముల కాల పరిమితి ముగిసింది.

వాటిని మార్చ్‌లో తొలగించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం వస్తున్న వరదలకు డ్యాములు తట్టుకుంటాయా లేదా అని ఆధికారులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం వరకూ భారీ వర్షాలు కురుస్తాయని అమెరికన్ వాతావరణ శాఖ ప్రకటించింది. వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు భారీగా నిధులు కేటాయించింది రాష్ట్రప్రభుత్వం.

ఇవి కూడా చదవండి

ఈ ఇంటి ఖరీదు రూ. 6.5 కోట్లు … కానీ బాత్రూమ్‌కు డోర్ లేదు.. ప్రత్యేకత ఏంటో తెలుసా..

కేజీఎఫ్ స్టార్ యష్ తల్లిదండ్రులకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వివాదం.. అసలు కారణం ఇదే.!

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..