Gun Attack: మెక్సికోలో రెండు డ్రగ్స్ ముఠాల మధ్య కాల్పులు.. ఇద్దరు చిన్నారులతో సహా 8మంది మృతి
ఉత్తర-మధ్య మెక్సికోలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు చిన్నారులతో సహా ఎనిమిది మంది మరణించారని అధికారులు తెలిపారు. రెండు డ్రగ్స్ ముఠాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో స్థానికులు ప్రాణాలు కోల్పోయారు.
Gun Attack in in Mexico: ఉత్తర-మధ్య మెక్సికోలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు చిన్నారులతో సహా ఎనిమిది మంది మరణించారని అధికారులు తెలిపారు. రెండు డ్రగ్స్ ముఠాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో స్థానికులు ప్రాణాలు కోల్పోయారు. గ్వానాజువాటో రాష్ట్రంలోని సిలావో నగర శివార్లలోని సైకిళ్లపై వచ్చిన దుండగులు ఓ ఇంట్లో దాగి ఉన్న డ్రగ్స్ ముఠాను టార్గెట్ చేస్తూ కాల్పులకు తెగబడ్డారు. ఈఘటనలో ఓ ఇంట్లో 16 ఏళ్ల బాలిక, 16 నెలల బాలుడుతో సహా ఎనిమిది మంది తుపాకీ గుళ్లకు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సిలావో నగర శివార్లలో దాడి చేసిన వారు ఒక ఇంట్లో ఉన్న నలుగురు పురుషులను లక్ష్యంగా చేసుకున్నారని, వారిలో ఒక మహిళ కూడా చనిపోయారని పోలీసులు తెలిపారు.
మాదకద్రవ్యాల రవాణపై ఉక్కుపాదం మోపుతున్న మెక్సికో ప్రభుత్వం 2006లో నిషేధం విధించింది. ఈ క్రమంలోనే సైనిక చర్యకు సైతం పాల్పడింది. అయినప్పటికీ మాదకద్రవ్యాల అక్రమ దందా ఆగడంలేదు. ఇదిలావుంటే, అధికారుల గణాంకాల ప్రకారం.. మెక్సికో దేశంలో 3 లక్షలకు పైగా మాదకద్రవ్యాల కారణంగా హత్యలు నమోదయ్యాయి.
మెక్సికోలో అత్యంత హింసాత్మక రాష్ట్రాల్లో గ్వానాజువాటో రాష్ట్రం ఒకటి. డ్రగ్ ముఠాలైన శాంటా రోసా డి లిమా, జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్స్ మధ్య తరుచూ కాల్పులులు జరుగుతుంటాయి. దీంతో ఏక్షణాన ఏంజరుగుతుందో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. గత నెలలో సిలావోలో జరిగిన దాడుల్లో 11 మంది మరణించారు.
Read Also… Crime News: మాస్కు పెట్టుకోలేదని గదిలోకి తీసుకెళ్లి, అఘాయిత్యానికి పాల్పడ్డ ప్రధానోపాధ్యాయుడు..!